షావోమి యొక్క 64MP సూపర్ కెమెరా ఫోన్ REDMI NOTE 8 PRO మొదటి సేల్

షావోమి యొక్క 64MP సూపర్ కెమెరా ఫోన్ REDMI NOTE 8 PRO మొదటి సేల్
HIGHLIGHTS

ఈరోజు మధ్యాహ్నం 12 గంటకి mi.com మరియు అమేజాన్ ఇండియా ఆన్లైన్ ప్లాట్ఫారాల నుండి జరగనుంది

షావోమి, ఇండియాలో REDMI NOTE 8 PRO  స్మార్ట్ ఫోన్ను గొప్ప స్పెక్స్ తో చాలా తక్కువ ధరకే లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ వేనుక ఒక 64MP ప్రధాన కేమెరా గల క్వాడ్ కెమెరాతో మరియు గేమింగ్ కోసం ప్రత్యేకమైన మీడియా టెక్ హీలియో G90T చిప్ సెట్ తో వచ్చింది. ఈ ఫోన్ను మాత్రం కేవలం రూ.14,999 రూపాయల ప్రారంభదరతో ధరతో మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటకి mi.com మరియు అమేజాన్ ఇండియా ఆన్లైన్ ప్లాట్ఫారాల నుండి జరగనుంది

రెడ్మి నోట్ 8 ప్రో  : ధరలు

1. రెడ్మి నోట్ 8 ప్రో (6GB +64GB ) – Rs.14,999/-

2. రెడ్మి నోట్ 8 ప్రో (6GB +128GB ) – Rs.15,999/-

3. రెడ్మి నోట్ 8 ప్రో (8GB +128GB ) – Rs.17,999/

రెడ్మి నోట్ 8 ప్రో ప్రత్యేకతలు

రెడ్మి నోట్ 8 ప్రో ఒక 6.53-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో ఇది 3D కర్వ్డ్ గ్లాస్ తో వస్తుంది.  ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్‌లో మీరు దాని వెనుక భాగంలో డైమండ్ కట్ గ్రేడ్ ఆకృతిని సరికొత్తగా చూడనున్నారు. అదనంగా, ఇందులో గేమింగ్ కోసం మీడియా టెక్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన మీడియాటెక్ G90T గేమింగ్ చిప్‌సెట్‌ తోఈ స్మార్ట్ శక్తినిస్తుంది.మరొక కొత్త విషయం ఏమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ Alexa Built-ఇన్ తో వస్తుంది మరియు ఇండియాలో ఈ ప్రత్యేకతతో వచ్చిన మెట్టమొదటి స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది. 

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  64 MP సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక మరియు  కెమెరాను అందించింది, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 20MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 ప్రోలో,ఒక 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అలాగే, బాక్సుతో పాటుగా ఒక 18W చార్జరును అందించారు.      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo