షావోమి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయిన REDMI 7A మొదటి సేల్ : మధ్యాహ్నం 12 గంటలకి

షావోమి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయిన REDMI 7A మొదటి సేల్ : మధ్యాహ్నం 12 గంటలకి
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ను రూ.5999 ప్రారంభ ధరతో విడుదల చేసింది.

జూలై నెలలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారికి మాత్రం రూ. 5,799 ధరకె అందిస్తోంది.

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12గంటలకి Flipkart మరియు Mi.com ద్వారా జరగనుంది.

ఇటీవల, షావోమి రెడ్మి 7A ని కేవలం బడ్జెట్ ధరలో మంచి స్పెక్స్ తో ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, రూ. 5,999 ధరలో పెద్ద బ్యాటరీ మంచి డిస్ప్లే మరియు మరిన్ని ట్రెండీ ఫీచర్లతో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ను రూ.5999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే, జూలై నెలలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారికి మాత్రం 200 రూపాయల ధరను తగ్గించి రూ. 5,799 ధరకె అందిస్తోంది. షావోమి, ఈ కార్యక్రమాన్ని తన ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అందించింది.  అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12గంటలకి Flipkart మరియు Mi.com ద్వారా జరగనుంది.  

షావోమి రెడ్మి 7A రెగ్యులర్ ధరలు

షావోమి రెడ్మి 7A  – 2GB + 16GB – రెగ్యులర్ ధర : Rs.5999

షావోమి రెడ్మి 7A  – 2GB + 32GB – రెగ్యులర్ ధర : Rs.6199

షావోమి రెడ్మి 7A జూలై అఫర్ ధరలు

షావోమి రెడ్మి 7A  – 2GB + 16GB – జూలై అఫర్ ధర : Rs.5799

షావోమి రెడ్మి 7A  – 2GB + 32GB – జూలై అఫర్ ధర : Rs.5999

షావోమి రెడ్మి 7A ప్రత్యేకతలు

షావోమి రెడ్మి 7A స్మార్ట్ ఫోన్, ఒక పాలికార్బోనేట్ తో ఇవ్వబడింది మరియు ఇది P2i నానో-కోటింగ్ ద్వారా అందించబడింది కాబట్టో స్ప్లాష్ ప్రూఫ్ గా పనిచేస్తుంది. ఈ షావోమి రెడ్మి 7A ను 18:9 ఆస్పెక్ట్ రేషియో కలిగినటువంటి ఒక 5.45 అంగుళాల HD+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో అందించింది. అలాగే, ఇది ఒక 2.0 GHz వరకు క్లాక్ స్పీడ్ అందించగల ఒక స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసరుకు జతగా, 2GB ర్యామ్ మరియు 16 GB లేదా 32 GB ఎంపికలతో వస్తుంది. అధనంగా, ఆండ్రోయిడ్ 9 పై ఆధారంగా MIUI 10 OS తో లాంచ్ చేశారు.

ఇక ఈ ఫోన్ యొక్క కెమేరా విభాగానికి వస్తే, ఇది ఒక 12MP సింగిల్ రియర్ కేమేరా Sony IMX 486 సెన్సారుతో అందించబడింది. ముందుభాగంలో సెల్ఫీ కోసం, ఈ ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ షావోమి పరికరం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది, ఇది 10W ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo