Xiaomi Redmi 6, Redmi 5 A ఫోన్లు Flipkart మరియు Mi.com ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లాష్ సేల్ కి ఉండనున్నాయి.

HIGHLIGHTS

Xiaomi Redmi 6 ఒక 5.45 అంగుళాల HD + 18: 9 డిస్ప్లే మరియు ఒక డ్యూయల్ - కెమెరా సెటప్ కలిగిన బడ్జెట్ స్మార్ట్ఫోన్.

Xiaomi ఇటీవల దాని Redmi 6 స్మార్ట్ఫోన్ల సిరీస్ను భారతదేశంలో ప్రకటించింది – Redmi 6A, Redmi 6 మరియు Redmi 6 Pro. నేడు, Xiaomi Redmi 6 స్మార్ట్ఫోన్ ఒక ఫ్లాష్ సేల్ ద్వారా కొనుగోలు కోసం అందుబాటులో ఉంటుంది. దీనిని Flipkart మరియు Mi.com ద్వారా 12PM వద్ద కొనుగోలుచేయవచ్చు. స్మార్ట్ఫోన్ 18: 9 డిస్ప్లే యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంది మరియు ఒక డ్యూయల్ – వెనుక కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. Redmi 6 తో పాటు, Redmi 5A కూడా Flipkart మరియు Mi.com లో సేల్ కి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ సమయాని కంటే ముందే సిద్ధంగా ఉండాల్సివుంటుంది.

రెడ్మి 6 స్పెసిఫికేషన్స్

రెండు, Redmi 6 స్మార్ట్ఫోన్ ఒక 18: 9 యాస్పెక్స్ట్ రేషియోతో డిస్ప్లే కలిగిఉంటుంది.  Redmi 6 ఒక 5.45-అంగుళాల HD + డిస్ప్లేని 18:9 యాస్పెక్ట్ రేషియోతో కలిగి ఉంది మరియు మీడియా టెక్ హీలియో P22 ఆక్టా-కోర్ SoC చే శక్తిని కలిగి ఉంది. ఈ ఫోన్ MIUI 9.6 ట్ కూడిన ఆండ్రాయిడ్ 8.1 Oreo తో నడుస్తుంది బాక్స్ నుండి వస్తూనే.  రెడ్మి 6 12MP + 5MP డ్యూయల్ – వెనుక కెమెరా సెటప్ను PDAF మద్దతుతో కలిగి ఉంది. ముందు షియోమీ యొక్క AI పోర్ట్రైట్ మోడ్కు మద్దతిచ్చే 5MP సెన్సార్ ఉంటుంది. ఈ Redmi 6 లోని ప్రాథమిక కెమెరా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిజేషన్ మరియు Xiaomi యొక్క AI బ్యూటీ అండ్ పోర్ట్రైట్ మోడ్లకు అనుమతిస్తుంది . ఇందులో ఒక 3000mAh బ్యాటరీ మరియు శక్తి స్మార్ట్ఫోన్ 8.3mm మందం మరియు 146 గ్రాముల బరువు ఉంటుంది.

రెడ్మి 5ఏ స్పెసిఫికేషన్స్

గత సంవత్సరం Redmi 5A విడుదలైంది మరియు ఈ ఫోన్  ఒక 5 అంగుళాల HD డిస్ప్లే తో వస్తుంది మరియు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425 SoC చే శక్తిని కలిగి ఉంది. ఇది ఒక 13MP ప్రాధమిక కెమెరాను కలిగి ఉంది ఒక LED ఫ్లాష్ తో అనుబంధం కలిగి ఉంది మరియు ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్ (PDAF) కు మద్దతు ఇస్తుంది. ఇది f / 2.0 ఎపర్చరుతో 5MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. డ్యూయల్ సిమ్ మరియు ఈ డివైజ్  Android 7.1 నౌగాట్ పైన లేయర్డ్ MIUI 9 తో నడుస్తుంది మరియు 3000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది.

Xiaomi Redmi 6 మరియు  Redmi 5A ధరలు

ఈ స్మార్ట్ఫోన్ రెండు రకాల ఎంపికలతో ఎంచుకునే వీలుంది, 32GB అంతర్గత స్టోరేజితో 3GB RAM వేరియంట్ కోసం మీరు రూ .7,999 ధర  చెల్లించాల్సి వుంటుంది. 64GB అంతర్గత స్టోరేజితో 3GB RAM యొక్క అధిక వేరియంట్ రూ . 9,499 ధరతో ఉంటుంది. ఈ రెండు రకాలు Mi.com మరియు Flipkart ద్వారా అందుబాటులో ఉంటాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డును ఉపయోగించి Redmi 6 కొనుగోలు చేసే వారికి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు రూ. 500 ల తక్షణ డిస్కౌంట్ను అందిస్తున్నాయి. Redmi 6 డివైజ్ సిరీస్ ప్రారంభించినప్పుడు, స్మార్ట్ఫోన్ తయారీదారు స్మార్ట్ఫోన్ల ధరలు మరియు పరిచయ ధరలు రెండు నెలల వరకు కొనసాగుతాయని చెప్పారు. అంటే స్మార్ట్ఫోన్ల ధరలో ఒకవేళ రెండు నెలల తరువాత మనం మార్పులను చూడొచ్చు కాబోలు.

ఇక Redmi 5A కి విషయానికి వస్తే, ఇది 2GB RAM / 16GB స్టోరేజి మోడల్ తో అందుబాటులో ఉంటుంది, ఇది రూ .5,999 ధారగా ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ యొక్క 3GB RAM / 32GB ROM వేరియంట్ ధర రూ .6,999. ఈ హ్యాండ్సెట్ బ్లూ, గోల్డ్, గ్రే, రోజ్ గోల్డ్ కలర్ మోడల్స్లో లభిస్తుంది.  యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డును ఉపయోగించి డివైజ్ని కొనడం ద్వారా 5 శాతం అదనపు తగ్గింపు పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :