ఈరోజు జరగనున్న రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ సేల్ వాయిదా పడింది

ఈరోజు జరగనున్న రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ సేల్ వాయిదా పడింది
HIGHLIGHTS

కరోనావైరస్ లాక్‌డౌన్‌ ప్రభావంతో ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇది వాయిదా పడింది.

రెడ్మి నోట్ 9 ప్రో తో పాటు రెడ్మి నోట్ 9 ప్రో మాక్స్‌ను మార్చి 12 న ప్రకటించింది. కేవలం ఆన్‌ లైన్మా కార్యక్రమం ద్వారా మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్లను విడుదల చేశారు. ఈ స్మార్ట్‌ ఫోన్లు రెండు కూడా ఒకే డిస్ప్లే, కలర్ ఆప్షన్స్ మరియు మరెన్నో విషయాలతో వస్తాయి. అయితే, నోట్ 9 ప్రో ఇటీవలే విక్రయించగా, భారతదేశంలో రెడ్మి నోట్ 9 ప్రో మాక్స్ యొక్క అమ్మకం మాత్రం మార్చి 25 న, అంటే ఈరోజు జరగాల్సి ఉంది. అయితే, తాజా అభివృద్ధి ప్రకారం, కరోనావైరస్ లాక్‌డౌన్‌  ప్రభావంతో ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇది వాయిదా పడింది.

షావోమి ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ ఈ తాజా పరిణామాన్ని ధృవీకరించడానికి ట్విట్టర్‌ ని మార్గంగా ఎంచుకున్నారు. అయితే, రెడ్మి నోట్ 9 ప్రో మాక్స్ సేల్ ఎప్పుడు జరగనుందో అనే విషయాన్ని మరియు ఖచ్చితమైన తేదీని ఆయన వెల్లడించలేదు. కానీ, రెడ్మి నోట్ 9 ప్రో అమ్మకం షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది.

ఈ రెడ్మి నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోను, ఒక 6.67 అంగుళాల పరిమాణంగల డాట్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది 2400×1080 పిక్సెళ్ళు అంటే FHD+ రిజల్యూషన్ తో వస్తుంది మరియు గరిష్టంగా 450 నిట్స్ బ్రైట్నెస్ అందిచే సామర్ధ్యంతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ప్రొటెక్షన్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్,  కొత్త ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 720G SoC శక్తితో పనిచేస్తుంది. ఇది 8nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది మరియు వేగంగా పనిచేస్తుంది. ఇది 618GPU తో వస్తుంది కాబట్టి గ్రాఫిక్స్ బాగా అనిపిస్తాయి మరియు గేమింగ్ మరింత ఆహ్లాదంగా ఉంటుంది. రెడ్మి నోట్ 9 ప్రో 4GB +64GB మరియు 6GB + 128GB వేరియంట్లలో లభిస్తుంది. 

ఈ ఫోన్ యొక్క స్పెక్స్ విషయానికి వస్తే, 64MP+8MP+5MP+2MP గల క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తుంది. అలాగే, రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ లో  32MP సెల్ఫీ కెమేరాని ఇచ్చింది. ఈ ఫోన్ యొక్క కెమేరా మాడ్యూల్ కూడా చతురస్రాకారంలో అందించింది. అంటే, మునుపెన్నడూ రెడ్మి ఫోన్లలో చూడనటువంటి డిజన్ను ఈ ఫోనులో అందించింది.  ఇక బ్యాటరీ మరియు ఛార్జింగ్ విషయానికి వస్తే,  ఈ రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ఒక 5020mAh బ్యాటరీని కలిగివుంటుంది. అంతేకాదు, రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ఒక 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo