Xiaomi Mi Note 10 Lite ఇండియాలో Mi 10i గా విడుదల కావచ్చు

Xiaomi Mi Note 10 Lite ఇండియాలో Mi 10i గా విడుదల కావచ్చు
HIGHLIGHTS

Xiaomi Mi Note 10 Lite షియోమి మి నోట్ 10 లైట్ ని భారతదేశంలో Mi 10i గా ప్రారంభించటానికి చూస్తున్నట్లు కనిపిస్తోంది.

మి నోట్ 10 లైట్ ఏప్రిల్ 30 న రెడ్‌మి నోట్ 9 సిరీస్ ‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యబడింది

షియోమి మి నోట్ 10 లైట్ ‌ను Mi 10 గా ఇండియా మార్కెట్ కోసం రీబ్రాండ్ చేయాలని చూస్తున్నట్లు అర్ధమవుతోంది.

Xiaomi Mi Note 10 Lite షియోమి మి నోట్ 10 లైట్ ని భారతదేశంలో Mi 10i గా ప్రారంభించటానికి చూస్తున్నట్లు కనిపిస్తోంది. మి నోట్ 10 లైట్ ఏప్రిల్ 30 న రెడ్‌మి నోట్ 9 సిరీస్ ‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యబడింది మరియు మి నోట్ 10 మరియు మి నోట్ 10 ప్రో ఫోన్లతో పాటుగా ఈ సిరీస్ లో కలిసిపోతుంది.

ట్విట్టర్‌ లో ది టెక్ గై చేసిన ట్వీట్ ప్రకారం, షియోమి మి నోట్ 10 లైట్ ‌ను Mi 10 గా ఇండియా మార్కెట్ కోసం రీబ్రాండ్ చేయాలని చూస్తున్నట్లు అర్ధమవుతోంది.  షియోమి మి 10 ను భారతదేశంలో మే 8 న లాంచ్ చేశారు, అయితే 10 లైట్ మిడ్-రేంజ్ స్మార్ట్ ‌ఫోన్ విభాగంలో సరసమైన ఫోన్ ‌గా రూపొందించవచ్చు. ఈ ప్రత్యేక బడ్జెట్ విభాగంలో ఇప్పటికే వున్న వన్ ‌ప్లస్ నార్డ్ మరియు రియల్‌ మీ ఎక్స్ 3 సిరీస్ వంటి మరికొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్లకు పోటీగా తీసుకురావచ్చని అంచనావేస్తున్నారు.

 

 

Mi Note 10 Lite: స్పెసిఫికేషన్స్

మి నోట్ 10 లైట్ ఒక 6.47-అంగుళాల పూర్తి HD + (2340 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED స్క్రీన్ ‌ను ముందు కెమెరా కోసం వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో కలిగి ఉంది. ఈ స్క్రీన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.

ఈ ఫోన్‌ వేగవంతమైన లేటెస్ట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 జి ఆక్టా-కోర్ చిప్ ‌సెట్ కలిగి ఉంది. వినియోగదారులు ఎంచుకోవడాని 6GB / 8GB RAM మరియు 64GB / 128GB స్టోరేజ్ ఎంపికలతో జత చేయబడింది.

Mi Note 10 Lite: కెమేరా 

నోట్ 10 లైట్‌ లో 64 ఎంపి ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా, 5 ఎంపి డెప్త్ సెన్సార్, 2 ఎంపి మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు వైపు, f / 2.4 ఎపర్చర్‌తో 16MP సెల్ఫీ కెమెరా ఉంది.

Mi Note 10 Lite: బ్యాటరీ

షియోమి మి నోట్ 10 లైట్ లో ఒక 5,260 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ మద్దతుతో వస్తుంది. ఈ Mi Note 10 Lite కేవలం 65 నిమిషాల్లో 0-100% నుండి ఛార్జ్ చేయగలదని పేర్కొంది.

Mi Note 10 Lite: అంచనా ధర

6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ కలిగిన మి నోట్ 10 లైట్ యొక్క బేస్ వేరియంట్ ధర 349 యూరోలు (సుమారు Rs. 28,400), 128 జిబి స్టోరేజ్ ఆప్షన్ ధర 399 యూరోలు (సుమారు Rs. 32,500).

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo