షావోమి Mi A3 VS రియల్మీ5 ప్రో : కంపారిజన్

షావోమి Mi A3 VS రియల్మీ5 ప్రో : కంపారిజన్
HIGHLIGHTS

ఈ రెండు ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్ల మధ్య స్పెషికేషన్లను సరిపోల్చి తెలుసుకుందాం.

షావోమి Mi A 3ను భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విడుదల చేసింది.  బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో, షావోమి ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ గత నెలలో చైనాలో విడుదల చేసిన  మి CC 9 e యొక్క రెండవ వేరియంట్. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, వాటర్‌డ్రాప్ నోచ్, 4,030 mAh  బ్యాటరీ మరియు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్ కొత్త రియల్మీ 5 ప్రో తో ఎంతవరకు పోటీ పడనుంది, అనే విషయాన్ని తెలుసుకోవడానికి, ఈ రోజు మనం రెండు ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్ల మధ్య స్పెషికేషన్లను సరిపోల్చి తెలుసుకుందాం.   

షావోమి మి A3 Vs రియల్మీ 5 ప్రో : ధరల పోలిక

ఈ Mi A 3  రూ .12,999 ప్రారంభ ధర వద్ద ప్రారంభించబడింది, దీనిలో మీకు బేస్ వేరియంట్ అయిన 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది. అదే సమయంలో, దాని 6 జిబి ర్యామ్ + 128 జిబి వేరియంట్‌ను రూ .15,999 ధరతో లాంచ్ చేశారు. ఇక రియల్మీ 5 ప్రో ధర గురించి చూస్తే, ఈ ఫోన్ యొక్క 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .13,999 కాగా, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ .14,999 కు పొందవచ్చు, ఇక హై ఎండ్ వేరియంట్ అయిన, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ని రూ .16,999 ధరతో సొంతం చేసుకోవచ్చు.

Mi A3 Vs రియల్మీ 5 ప్రో : డిస్ప్లే అంతరాలు

ఈ మి A3 లో, మీకు 6.08-అంగుళాల HD + డాట్ నాచ్ గల ఒక సూపర్ AMOLED స్క్రీన్ లభిస్తుంది. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ యొక్క రెండు వైపులా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క రక్షణను వినియోగదారులు పొందుతారు. మి ఎ 3 మునుపటి మి ఎ 2 యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్. అయితే, ఈ విభాగంలో రియల్మీ 5 ప్రో లో మాత్రం ఒక 6.3-అంగుళాల పెద్ద డిస్ప్లే ఉంది మరియు కొత్త క్రిస్టల్ డిజైన్‌తో పరికరం ప్రారంభించబడింది. ఇంకా  ఇది క్రిస్టల్ గ్రీన్ మరియు స్పార్క్లింగ్ బ్లూ ఆప్షన్లతో ఎంచుకునేలా లభిస్తుంది.

Mi A3 Vs రియల్మీ 5 ప్రో : కెమెరా వివరాలు

షావోమి, తన Mi A3 ఫోన్  ఒక ​​ట్రిపుల్ కెమెరా సెటప్‌ తో ప్రవేశపెట్టింది. దీనిలో, మీరు 48 మెగాపిక్సెల్ ప్రాధమిక సోనీ IMX586 సెన్సార్‌ను ఎపర్చరు f / 1.79 లెన్స్, 8-మెగాపిక్సెల్ 118-డిగ్రీ వైడ్ యాంగిల్ సెకండరీ సెన్సార్  మరియు , డెప్త్ సెన్సింగ్ కోసం 2 మెగాపిక్సెల్ తృతీయ సెన్సార్‌ను పొందుతారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో f / 2.0 ఎపర్చరు లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇక రియల్మీ 5 ప్రో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 48 MP Sony IMX586 ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ షాట్‌లను సంగ్రహించే మరో 8 MP కెమెరా, డెప్త్ కోసం 2 MP కెమెరా, ఇది పోర్ట్రెయిట్ షాట్ల కోసం ఉపయోగించబడుతుంది మరియు నాల్గవ కెమెరా 2MP అల్ట్రా మాక్రో లెన్స్ తో ఉంటుంది. నైట్స్కేప్ మోడ్, క్రోమా బూస్ట్ వంటి ఫీచర్లు కెమెరా యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం 16 MP Sony IMX471 సెన్సార్ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఇవ్వబడింది.

Mi A3 Vs రియల్మీ 5 ప్రో : ప్రాసెసర్ యొక్క పనితీరు

Mi A 3 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC , అడ్రినో 610 GPU  కూడా ఉన్నాయి. ఇది 6 GB  LPDDR 4X ర్యామ్‌తో వస్తుంది. ఇక రియల్మీ 5 ప్రో యొక్క పనితీరు గురించి మాట్లాడితే, ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 AIE, అడ్రినో 616 తో ప్రారంభించబడింది మరియు ఈ ఫోన్‌లో 8GB RAM మరియు 128GB స్టోరేజ్ ఉంది. సిస్టమ్ బూస్ట్, గేమ్ బూస్ట్ మరియు యాప్ బూస్ట్ కోసం ఈ స్మార్ట్ ఫోనులో హైపర్ బూస్ట్ 2.0 ను అందించారు.

Mi A3 Vs రియల్మీ 5 ప్రో : బ్యాటరీ మరియు ఇతర ఫీచర్లు

 ఈ మి ఎ 3 లో 4,030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. దీనిలో మీరు USB టైప్-సి పోర్ట్ మరియు 3.5 మిమీ ఆడియో జాక్  పొందుతారు.  మి ఎ 3 లో IR బ్లాస్టర్, P 2 i  కోటింగ్ కూడా ఉన్నాయి. రియల్మీ 5 ప్రో లో 4035 ఎంఏహెచ్ బ్యాటరీని VOOC 3.0 ఛార్జీకి సపోర్ట్ చేస్తుంది మరియు 20W టైప్-సి ఛార్జర్ కూడా బాక్స్‌లో లభిస్తుంది. రియల్మీ 5 సిరీస్‌కు స్ప్లాష్ రెసిస్టెంట్ డిజైన్ ఇవ్వబడింది. కలర్‌OS 6 తో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo