Xiaomi Mi 6X స్మార్ట్ఫోన్ చైనాలో ప్రారంభించబడింది మరియు ఈ స్మార్ట్ఫోన్ Mi 5X స్థానంలో ఉంది. Mi 6X అధునాతన ఫుల్ స్క్రీన్ డిజైన్ మరియు డ్యూయల్ వెనుక కెమెరా సెటప్ తో ఉంది. ఈ డివైస్ ఒక స్నాప్డ్రాగెన్ 660 చిప్సెట్ ని కలిగి ఉంది.
Xiaomi మి 6X మెటల్ బాడీ డిజైన్ కలిగి వుంది . ఈ పరికరం యొక్క మందం 7.3mm ఉంది. ఈ పరికరం చెర్రీ పింక్, రెడ్ ఫ్లేమ్, గ్లేసియర్ బ్లూ, క్విక్సాండ్ గోల్డ్ మరియు బ్లాక్ స్టోన్ కలర్ వంటి అనేక రంగులలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. వర్టికల్ డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ పరికరంలో వెనుక భాగంలో ఉన్నాయి. పరికరం యొక్క ఎగువన IR బ్లాస్టర్ మరియు USB- సి పోర్ట్ దిగువన ఉంది.
ఈ డివైస్ Android 8.1 ఒరియో లో పనిచేస్తుంది మరియు MIUI 9.5 తో వస్తుంది, ఇది ఫుల్ స్క్రీన్ జెశ్చర్ మద్దతుతో వస్తుంది. ప్లస్ ఈ స్మార్ట్ఫోన్ xiao AI వాయిస్ అసిస్టెంట్ తో వస్తుంది. పరికరం యొక్క 6 GB RAM మరియు 128 GB స్టోరేజ్ వేరియంట్ 1,999 యువాన్ (~ $ 316) ధరకే ఉంది. దీనితో పాటు మిక్స్ 6X యొక్క 4 GB RAM మరియు 64 GB స్టోరేజ్ వేరియంట్స్ 1,599 యువాన్ (~ $ 253) మరియు 6 GB RAM మరియు 64 GB స్టోరేజ్ వేరియంట్స్ 1,799 యువాన్ (~ $ 285) ధరకే ఉంటాయి. ఈ డివైస్ ఏప్రిల్ 27 న చైనాలో సేల్ కి అందుబాటులో ఉంటుంది.
క్విక్ ఛార్జ్ 3.0 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో లభించే 3,010mAh బ్యాటరీ ఉంది. దీనితో పాటు, స్మార్ట్ AI పవర్ ఫంక్షన్ కూడా ఉంది.