Redmi 10: బడ్జెట్ ఫోన్ ధరలో వచ్చింది..కానీ బడ్జెట్ ఫోన్ కాదు ..ఎందుకంటే!!

Updated on 25-Mar-2022
HIGHLIGHTS

షియోమీ Redmi 10 స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ సెగ్మెంట్ లో విడుదల చేసింది

రెడ్ మీ 10 స్పెక్స్ మరియు ఫీచర్లను చూస్తే బడ్జెట్ ఫోన్ మాదిరిగా కనిపించదు

ఈ బడ్జెట్ ఫోన్ అతిపెద్ద 6,000mAh బ్యాటరీ, పెద్ద 6.71 డిస్ప్లే వంటి చాలా ఫీచర్లను కలిగి వుంది

షియోమీ Redmi 10 స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ సెగ్మెంట్ లో విడుదల చేసింది. అయితే, రెడ్ మీ 10 స్పెక్స్ మరియు ఫీచర్లను చూస్తే మాత్త్రం ఈ ఫోన్ ఎంత మాత్రమూ బడ్జెట్ ఫోన్ మాదిరిగా కనిపించదు. ఈ ఫోన్ అతిపెద్ద 6,000mAh బ్యాటరీ అతిపెద్ద 6.71 డిస్ప్లే వంటి చాలా ఫీచర్లను కలిగి వుంది.  ఈరోజే ఇండియన్  మార్కెట్లో అడుగుపెట్టిన ఈ షియోమీ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్ మేషన్ ఈ క్రింద చూడవచ్చు.

Redmi 10: స్పెక్స్

ముందుగా ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ షీట్ ను చూస్తే, రెడ్ మీ 10 పెద్ద 6.71 ఇంచ్ HD రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది. ఇది Widevine L1 సపోర్ట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 6nm స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు జతగా 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ విస్తరణతో పాటుగా 2GB వరకూ వర్చువల్ RAM ను కూడా పొందుతారు.

కెమెరాల పరంగా, ఈ ముసార్ట్ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరాకి జతగా 2MP డెప్త్ సెన్సార్ వుంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీని కూడా కలిగి వుంది (కానీ బాక్స్‌లో 10W అడాప్టర్ మాత్రమే వస్తుంది). ఈ షియోమీ లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా MIUI 12 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.

Redmi 10:

ఇక రెడ్ మీ 10 ఫో ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ యొక్క 4+64GB వేరియంట్‌ ధర రూ.10,999 మరియు రెండవ వేరియంట్ 6+128GB మోడల్‌ ధర రూ. 12,999. ఈ స్మార్ట్ ఫోన్ మార్చి 24 వతేది మధ్యాహ్నం 12PM నుండి Flipkart మరియు Mi Store లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC క్రెడిట్ కార్డు ద్వారా కొనేవారికి 1,000 తగ్గింపు ఆఫర్ల ను కూడా కంపెనీ అందించింది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :