వాట్సాప్ కొత్త ఫీచర్: మీరు చివరిగా వాట్సాప్ ఎప్పుడు చూశారో తెలియకుండా చెయ్యొచ్చు

వాట్సాప్ కొత్త ఫీచర్: మీరు చివరిగా వాట్సాప్ ఎప్పుడు చూశారో తెలియకుండా చెయ్యొచ్చు
HIGHLIGHTS

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ చేస్తోంది

మీరు వాట్సాప్ ఎప్పుడు చూశారో తెలియకుండా చేయవచ్చు

ఈ ఫీచర్ ను వాట్సాప్ బీటా వెర్షన్ లో పరీక్షించడం ప్రారంభించింది

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ చేస్తోంది మరియు ఇంకా మరిన్ని కొత్త ఫీచర్లను జతచేయనుంది. కొత్తగా వచ్చిన ఫీచర్లలో    ముఖ్యమైనది 'hide Last Seen' అని చెప్పొచ్చు. వాట్సాప్ ద్వారా పనిచేసే ఆఫిస్ వర్క్ తో కూడా కనెక్ట్ అయ్యివుంటాము మరియు వాట్సాప్ తో మనం ఎప్పుడూ కనెక్టెడ్ గా ఉంటాము. అయితే, మనం వాట్సాప్ లో ఎప్పుడు ఆన్లైన్ లో ఉన్నామో Last Seen ద్వారా ఎదుటి వారికీ తెలిసిపోతుంది. మన కుటుంబ సభ్యులలు పాటుగా సహోద్యుగులకు ఈవిషయం తెలిసిపోతుంది. కొన్ని సమయాల్లో ఇది ఇబంధికర విషయంగా మారుతుంది.

వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ తో ఈ ఇబ్బంది నుండి విముక్తి లభిస్తుంది. ఎందుకంటే, నిర్దిష్ట కాంటాక్స్ నుండి చివరిగా మీరు వాట్సాప్ ఎప్పుడు చూశారో తెలియకుండా చేసే కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది. Wabetainfo ప్రకారం, వాట్సాప్ ఈ ఫీచర్ ను వాట్సాప్ బీటా వెర్షన్ లో పరీక్షించడం ప్రారంభించింది. ముఖ్యంగా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు ఒత్తిడికి గురికాకుండా ఉండేటటువంటి నిర్దిష్ట ప్రైవసీ  ఫీచర్ గా ఉపయోగపడుతుంది

వాస్తవానికి, Wabetainfo ఈ ఫీచర్‌ని WhatsApp బీటా వెర్షన్ 2.21.23.14లో గుర్తించింది. దీని ప్రకారం, నిర్దిష్ట కాంటాక్ట్స్ నుండి మీ ప్రొఫైల్ ఫోటో మరియు నిర్దిష్ట కాంటాక్ట్స్ నుండి మీ స్టేటస్ అప్డేట్స్ ఎలాగయితే దాచ గలరో, అదేమాదిరిగా ఇది కూడా నిర్దిష్ట కాంటాక్స్ నుండి చివరిగా మీరు వాట్సాప్ ఎప్పుడు చూశారో తెలియకుండా చేయవచ్చు.

ఇది చెయ్యడానికి, అంటే వాట్సాప్ ను మీరు చివరిగా చూసిన టైమ్‌స్టాంప్‌ను Hide చేసే ఎంపిక క్రింద కనిపించే అప్షన్స్ లో లభిస్తుంది. దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు మరియు మీ లాస్ట్ సీన్ వారికీ కనిపించదు. అయితే, ఈవిధంగా చేయడం వలన మీరు కూడా వారి లాస్ట్ సీన్ ను తెలుసుకోలేరు.                      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo