ఒక స్మార్ట్ ఫోనులో ప్రాసెసర్ పాత్ర ఏమిటి మరియు మీకు ఎటువంటి ప్రాసెసర్ సరిపోతుంది.

ఒక స్మార్ట్ ఫోనులో ప్రాసెసర్ పాత్ర ఏమిటి మరియు మీకు ఎటువంటి ప్రాసెసర్ సరిపోతుంది.
HIGHLIGHTS

మీకోసం ప్రత్యేకంగా మొబైల్ ఫోన్లలోని ప్రాసెసర్ ని గురించి సవివరంగా చర్చిస్తున్నాను.

ప్రస్తుతం, స్మార్ట్ ఫోన్లు మన దైనందిన జీవితాల్లో ఒక కీలకమైన భాగంగా మారిపోయాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. సన్నిహితలు  మరియు ఇష్టమైన వారితో సన్నిహితంగా ఉండటమే కాక, ఈ స్మార్ట్ ఫోన్లు ఉద్యోగ మరియు వ్యాపార సాధనంగా కూడా పనిచేస్తాయి. అయితే, మనలో కొందరు ఇది వినోద సాధనంగా అనుకుంటే,  మరికొందరు ప్రత్యేక జ్ఞాపకాలను ఒడిసి పట్టుకోవటానికి  ఏకైక మార్గంగా ఉపయోగిస్తారు.

అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ల కోసం డిమాండ్ పెరిగింది కాబట్టి, సరఫరా కూడా పెరిగింది. ఒకానొక సమయంలో, ఒక మొబైల్ ఫోన్ను ఎంచుకోవడానికి, ఒక మొబైల్ షాపుకు  వెళ్లి తమ ఫేవరెట్ బ్రాండ్ అందించే ఫోన్ను ఎన్నుకోవడం చాలా సులభంగా అనిపించేది. కానీ ఈ రోజుల్లో, వివిధ మొబైల్ తయారీ సంస్థల నుండి వివిధ ఆఫర్లతో అనేకమైన ఎంపికలను మనం చూడవచ్చు. కానీ, ఇక్కడే ఒక సమస్య వుంది. అదేమిటంటే, ప్రతి వేరియంట్ లో వేర్వేరు హార్డ్వేర్ మరియు సాఫ్ట్ వేర్ ఫీచర్లతో  ఉంటుంది కాబట్టి వీటిలో మీకు ఏది సరైన ఎంపికగా ఉంటుందో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది.

ముఖ్యంగా, మీ బడ్జెట్ లో,  మీ వినియోగానికి తగిన విధంగా మరియు మరి ముఖ్యంగా, ఒక స్మార్ట్ ఫోనులో మీరు ఏమి కావాలనుకుంటున్నారో అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సివుంటుంది.  మొత్తంగా, ఈ విషయాలన్నీ కూడా మిమ్మల్ని అయోమయానికి గురిచేస్తాయి. కానీ మీరు భయపడాల్సిన అవసరంలేదు, మీరు కొనదలచిన స్మార్ట్ ఫోనులో ఎటువంటి ప్రాసెసర్ ఉంటే మీకు ఎటువంటి అటంకంలేకుండా, మీ ప్రతి రోజువారీ పనిని సులభంగా చేయగలదో, మీ మీ అవసరాలను  బట్టి ఎంచుకునేలా ఇక్కడ మీకోసం ప్రత్యేకంగా మొబైల్ ఫోన్లలోని ప్రాసెసర్ ని గురించి సవివరంగా చర్చిస్తున్నాను.

1. ప్రాసెసర్

దీని వలన కలిగే లాభం: ఎక్కువ శక్తివంతమైన ప్రాసెసర్ వలన ఆ ఫోన్ తక్కువగా హ్యాంగ్ అవుతుంది.

అసలు ఇది ఏమిటి :

స్మార్ట్ ఫోన్ యొక్క మెదడుగా మనం ప్రాసెసర్ ని అనుకోవచ్చు. ఎందుకంటే, ఫోన్ లో మనం చేసే ప్రతి పనిని ప్రాసెసర్ నిర్వహిస్తుంది. కంప్యూటర్లతో పోలిస్తే మొబైల్ ఫోనులో ఇది పూర్తిగా బిన్నంగా ఉంటుంది. కంప్యూటరులో వివిధ రకాలైన పనులు చెయ్యడానికి, వివిధరకాలైన చాలా చిప్స్ తో కలిపి ఉంటుంది. ఇవన్నీ లేకుండా ఒక CPU పనిచెయ్యడం అసాధ్యం. అయితే, స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే, ఇవి SoC తో పనిచేస్తాయి. SoC అంటే, System On Chipset. అంటే, ఒక ఫోనులో జరిగే అన్ని పనులను కేవలం SoC అంటే ప్రాసెసర్ మాత్రమే నిర్వహిస్తుంది.  ఉదాహరణకు చెప్పాలంటే, ఫోన్ పవర్ మేనేజ్మెంట్, గ్రాఫిక్స్ ని ప్రాసెస్ చేయడం, USB, కెమేరా, WiFi, సిగ్నల్ (3G,4G LTE) మరియు ఇటువంటి అన్ని పనులను ఈ ప్రాసెసర్ నిరంతరంగా నిర్వహిస్తుంది.                                

మన స్మార్ట్ ఫోన్ ఒక శక్తివంతమైన ప్రాసెసర్ ద్వారా, సున్నితమైన ఫోటో ఎడిటింగ్, అప్లికేషన్లు (APPs) వేగంగా ఓపెన్ చెయ్యడం మరియు గేమింగ్ చేస్తున్నప్పుడు  నెమ్మదించడం వంటి సమస్యలు ఉండవు. ప్రస్తుతం, మొబైల్ ఫోన్ల కోసం అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855+, ఇది వన్ ప్లస్ 7T,అసూస్ ROG ఫోన్ 2, రియల్మీ X2 ప్రో మరియు నుబియా రెడ్ మ్యాజిక్ వంటి ఫోన్లలో  అందుబాటులో ఉంది.  కొన్ని నెలల క్రితం వరకు, స్నాప్ డ్రాగన్ 845 మరియు స్నాప్ డ్రాగన్ 855 అనేది టాప్ మొబైల్ CPU గా ఉంది, కాబట్టి ఆ ప్రాసెసర్లతో ఉన్న ఫోన్ల పనితనం కూడా చక్కగానే ఉంటుంది.

2. ప్రాసెసర్ బ్రాండ్

ప్రయోజనం: తక్కువ ధర విభాగంలో మీకు ఎక్కువ ఎంపికల సౌలభ్యం తెస్తుంది.

అది ఎలాగ ?

మార్కెట్లో మనం చూసే Android స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా క్వాల్కమ్ లేదా మీడియా టెక్ ప్రాసెసర్లతో వస్తాయి. క్వాల్కమ్, అన్ని హై ఎండ్ స్మార్ట్ ఫోన్ కోసం ప్రాసెసర్ ఎంపిక అయితే, మీడియా టెక్ ఎంట్రీ స్థాయి స్మార్ట్ ఫోన్లు మరియు మిడ్ రేంజ్ సెగ్మెంట్ కోసం రూపొందించిన ఫోన్ల కోసం ప్రాసెసర్లపై దృష్టి పెడుతుంది. ఈ ప్రాసెసర్లు పవర్ మరియు బ్యాటరీ లైఫ్ మధ్య సమతుల్యతను నమోదు చేస్తాయి. మీరు శామ్సంగ్ లేదా హానర్ ఫోన్లను కొనుగోలు చేస్తే, మీకు వాటిలో Exynos లేదా Kirin  SoC లను వాటిలో ప్రత్యేకంగా చూడవచ్చు. ఇక ఆపిల్ విషయానికి వస్ట్, ఆపిల్ దాని సొంత ప్రాసెసర్ను ఐఫోన్ కోసం చేస్తుంది, తాజాగా A13 బయోనిక్ చిప్ ని  వాటి ఫోన్ల కోసం అందుబాటులో తెచ్చింది. స్నాప్ డ్రాగన్ మరియు మీడియా టెక్ ప్రాసెసర్ల విహాసినికి వస్తే, స్నాప్ డ్రాగన్ చిప్ సెట్స్ సాధారణంగా మంచి పనితీరును కలిగి ఉంటాయి. కానీ, వీటికోసం అధిక ధరను చెల్లించాల్సి వస్తుంది .

చిట్కా :

ఈ  ప్రాసెసర్ల విషయానికి వచ్చినపుడు, పేరులో కనబడే ఉన్నత సంఖ్య దాని అధిక పనితీరును సూచిస్తుంది. ఉదాహరణకు, స్నాప్ డ్రాగన్ 855 స్నాప్ డ్రాగన్ 845 కంటే మెరుగైనది,అలాగే స్నాప్ డ్రాగన్ 845 స్నాప్ డ్రాగన్ 712 కంటే ఉత్తమం.

3. ప్రాసెసర్ లక్షణాలు

ప్రతి ప్రాసెసర్ ఒక డిటైల్ ను కలిగి ఉంటుంది. ఇందులో, అవి అమలు చేసిన క్లాక్ లతో పాటు ఈ చిప్స్ లో ఉన్న కోర్ల సంఖ్యను సూచిస్తుంది . సాధారణంగా, ఇది "1.4GHz ఆక్టా కోర్ ప్రాసెసర్" లేదా "2.0GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్" లాగా ఉంటుంది. అధిక కోర్ సంఖ్య, ప్రతిసారీ మంచి పనితీరుకు దారితీయకపోయినా, అధిక క్లాక్  స్పీడ్ మాత్రం ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఎక్కువ పనితీరును నమోదు చేస్తుంది.

4. Cores

దీని వలన కలిగే లాభం : ఎక్కువ కోర్లు  = అధిక పనితీరు.

Cores , ఇవి ప్రాసెసర్ యొక్క కండరములు లాగా మనం ఊహించుకోవచ్చు.  ఎక్కువ కోర్ల సంఖ్య, మరింత శక్తివంతమైన ప్రాసెసర్ పనితీరును చూపుతుంది. కాబట్టి, ఆక్టా (8)  కోర్ సాధారణంగానే క్వాడ్(4) -కోర్ కంటే మరింత శక్తివంతంగా ఉంటాయి. ఇక ఈ క్వాడ్ కోర్స్ డ్యూయల్(2) – కోర్ కంటే మరింత శక్తివంతమైనవి. ప్రాసెసర్లకు వాటిలో స్థిరమైన సంఖ్యలో కోర్లు ఉన్నాయి మరియు ఇది మీరు మార్చగలిగేది కాదు. కానీ, మీరు ఒక ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం, మీ బడ్జెట్ ను అనుసరించి ఎక్కువ లేదా తక్కువ కోర్ల ఎంపికగా ఎంచుకోవచ్చు.

అవాస్తవం : ఎల్లప్పుడూ అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రాసెసర్ ఫోన్లను మాత్రమే ఎంచుకోవాలి.  

వాస్తవం    :  మీరు ప్రత్యేకించి భారీ గేమ్స్ లాంటివి ఆడే సమయాలలో తప్ప, మీకు సాధారణ సమయాల్లో ఎక్కువ సంఖ్య ప్రాసెసర్ (పెద్ద ప్రాసెసర్) అవసరముండదు.

5. Clock Speed

దీని వలన కలిగే లాభం: వేగవంతమైన ఈ క్లాక్ – స్పీడ్, మీకు మంచి పనితీరు అందిస్తుంది.

దీని పనేమిటి ?

Clock Speed అంటే మీ ప్రాసెసర్ చేయగల పని వేగం ఎంత ఉంటుంది, అనే విషయాన్ని సూచిస్తుంది. ఇది సాధారణంగా GHz గా చెబుతారు మరియు దీని అధిక సంఖ్య, మీ ప్రాసెసర్ వేగంగా కొలుస్తారు. ఈ రోజుల్లో, ప్రాసెసర్ల యొక్క అత్యధిక క్లాక్ – వేగం 2.96GHz టాప్-ఆఫ్-లైన్ గా చెప్పవచ్చు.

6. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్

గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా GPU, మీ గేమింగ్ పనితీరు వంటి విషయాలకు, మీ ఫోన్ పెర్ఫార్మెన్స్ లో ప్రధాన భాగంగా బాధ్యత వహిస్తుంది. GPU ప్రాసెసర్ యొక్క ఒక భాగం మరియు మీరు స్మార్ట్ ఫోన్ కోసం GPU ఎంచుకొవడం గురించి మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇది మీరు మీ స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ ఎంచుకునేప్పుడు, ఇది అందులో ఒక భాగంగా ఉంటుంది. సామాన్యంగా,  మొబైల్ ప్రాసెసర్లు తమ పనితీరును పూర్తి చేసే GPU లతో జతగా వస్తాయి. కాబట్టి, మీ CPU లో GPU ఉన్నస్థితిని మరియు దాని గురించి మీరు ఎక్కువగా బాధపడల్సిన అవసరం లేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo