వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ VIVO U20 మరొక ఫ్లాష్ సేల్

HIGHLIGHTS

ఈ ఫోన్ను కేవలం రూ. 9,990 రూపాయల ధరకే కొనవచ్చు.

వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ VIVO U20 మరొక ఫ్లాష్ సేల్

ఇటివల, వివో సంస్థ ఇండియాలో కేవలం బడ్జెట్ ధరలో తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్, VIVO U20 యొక్క మరొక ఫ్లాష్ సేల్ ఈరోజు మద్యాహ్నం 12 గంటలకి అమెజాన్ నుండి జరగనుంది. ఈ స్మార్ట్ ఫోన్ను, మంచి ప్రత్యేకతలతో కేవలం రూ.10,990 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈరోజు జరగనున్న మరొక ఫ్లాష్ సేల్ నుండి కూడా 9,990 రూపాయల ధరకే కొనేలా మరొక అవకాశాన్ని ఇప్పుడు అందించింది.ఈరోజు జరగనున్న ఫ్లాష్ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ను ICICI క్రెడిట్ లేదా క్రెడిట్ /డెబిట్ EMI ఎంపికలతో కొనేవారికి 1,000 రుపాయల నేరుగా డిస్కౌంట్  అందిస్తోంది. అంటే, ఈ ఫోన్ను కేవలం రూ. 9,990 రూపాయల ధరకే కొనవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

VIVO U20 ప్రత్యేకతలు

ఈ వివో యు 20 ఒక పెద్ద 6.35-అంగుళాల FHD + ఐపిఎస్ డిస్ప్లే తో లాంచ్ చేయబడింది మరియు ఈ ఫోన్ బ్లేజ్ బ్లూ మరియు రేసింగ్ బ్లాక్ వంటి రెండు మంచి కలర్ రంగులలో అందించబడుతోంది. ఇవి కాకుండా, ఒక పెద్ద 5000 mAh బ్యాటరీ కూడా ఈ ఫోనులో అందించబడింది, ఇది 18w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675AIE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి, ఈ ఫోన్ అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది, అలాగే ఫోనులో డార్క్ మోడ్‌ ని కూడా అందించారు.ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 పై ఆధారితంగా Funtouch OS 9.2 స్కిన్ పైన నడుస్తుంది.  

కెమెరా విభాగం గురించి మాట్లాడితే, ఈ ఫోన్ వెనుక భాగంలో AI ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 16 MP ప్రాధమిక కెమెరా మరియు దానికి జతగా ఒక 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు మూడవదిగా  2 MP  మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.                                

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo