VIVO Z5 ఒక 48MP ట్రిపుల్ కెమేరా మరియు సూపర్ AMOLED తో విడుదలయ్యింది

VIVO Z5 ఒక 48MP ట్రిపుల్ కెమేరా మరియు సూపర్ AMOLED తో విడుదలయ్యింది
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 4,500 బ్యాటరీ మరియు 22.5 వాట్స్ వేగవంతమైన ఛార్జింగ్ సాంకేతికతతో వస్తుంది.

వివో ఒక 48MP ప్రధాన కెమేరాతో కూడిన ట్రిపుల్ కెమేరా సెటప్ మరియు సూపర్ AMOLED డిస్ప్లేతో తన Z5 స్మార్ట్ ఫోన్ను చైనాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ను అన్ని ట్రెండీ ఫీచర్లతో తీసుకొచ్చినా కూడా కేవలం మధ్య స్థాయి ధరలో అందించడం ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 4,500 బ్యాటరీ మరియు 22.5 వాట్స్ వేగవంతమైన ఛార్జింగ్ సాంకేతికతతో వస్తుంది.        

వివో Z5 చైనా ధరలు

ఈ వివో Z5 చైనాలో కేవలం బడ్జెట్ ధరలో అందించింది.  Z5 యొక్క 6GB +64GB వేరియంట్ CNY 1,598 (సుమారు రూ .16,000) ధరతో,  మరొక 6GB + 128GB వేరియంట్ CNY 1,898 (సుమారు రూ .19,000) ధరతో మరియు 6GB + 256GB వేరియంట్ CNY 1,998 (సుమారు రూ .20,000) ధరతో ప్రకటించింది. ఇక ఉన్నతమైన వేరియంట్ అయినటువంటి, 8 GB  ర్యామ్ + 128 GB  స్టోరేజ్ ఉన్న మిగతా వేరియంట్ CNY 2,298 (సుమారు రూ .23,000) ధరతో లాంచ్ చేశారు.

వివో Z5  ఫీచర్లు మరియు ప్రత్యేకతలు ( చైనా వేరియంట్ )

ఈ వివో Z5 మొబైల్ ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోనులో ఒక 6.38 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే మరియు ఇది ఒక వాటర్‌డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఇది 1080×2340 పిక్సెళ్లు అంటే FHD+ రిజల్యూషన్ అందిస్తుంది. ఈ మొబైల్ ఫోన్‌ లో, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 ఆక్టా కోర్ ప్రాసెసర్ ని అందించింది. అదనంగా, ఇది 6GB/8GB  RAM తో అనుసంధానం చెయ్యబడింది మరియు ఇది 64/128/256 GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. ఈ ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ కూడా ఉంది.

వివో Z5 ఫోను యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే,  మీకు ఫోటోగ్రఫీ కోసం వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, f/1.79 అపర్చర్ గల ఒక 48MP ప్రాధమిక సెన్సార్‌కి జతగా మరొక 8MP వైడ్ యాంగిల్ కెమెరాను మరియు ఒక  2MP డెప్త్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా, మీకు ఈ ఫోన్‌లో f/2.0 అపర్చర్ గల 32 MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం అందించబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo