వివో Z1 ఫోన్, బెస్ట్ ట్రిపుల్ కేమెరా మరియు పంచ్ హోల్ డిజైన్ తో రేపు విడుదలకానుంది

వివో Z1 ఫోన్, బెస్ట్ ట్రిపుల్ కేమెరా మరియు పంచ్ హోల్ డిజైన్ తో రేపు విడుదలకానుంది
HIGHLIGHTS

ఈ వివో Z 1 ప్రో ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 ఆక్టా కోర్ ప్రాసరుకి జతగా గొప్ప ర్యామ్ శక్తితో రానున్నట్లు ప్రకటించింది.

ఈ ఫోన్ ఒక అతిపెద్ద 5,000mAh బ్యాటరీతో అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

ఇండియాలో VIVO తన సరికొత్త Z1 ప్రో స్మార్ట్ ఫోన్ను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ను రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 32MP పంచ్ హోల్  సెల్ఫీ కెమేరా మరియు ట్రిపుల్ రియర్ కెమేరాతో విడుదల చేయనుంది. అంతేకాదు, ఈ వివో Z1 ప్రో ను ఒక స్నాప్ డ్రాగన్ 712 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ను ప్రస్తుతం మార్కెట్లో ట్రెండీగా నడుస్తున్న ఫుల్ వ్యూ డిస్ప్లే మరియు స్టైలిష్ సెల్ఫీ కెమేరాలను ప్రధానాంశంగా చేసుకొని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

అలాగే, Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన దీని సంభందించి ఒక ప్రత్యేకమైన పేజీ ద్వారా టీజింగును అందిస్తోంది.  ఈ స్మార్ట్ ఫోన్ జూలై 3 వ తేదీన ఇండియాలో విడుదలకానుంది.  Vivo Z1 Pro  ప్రత్యేకతల విషయానికి వస్తే,  ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే మరియు దానికి సంబంధించిన వివరాలను అందించలేదు కానీ, ఈ వివో Z 1 ప్రో ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 ఆక్టా కోర్ ప్రాసరుకి జతగా గొప్ప ర్యామ్ శక్తితో రానున్నట్లు  ప్రకటించింది. అలాగే, ఈ ఫోన్ ఒక అతిపెద్ద 5,000mAh బ్యాటరీతో అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో f/1.78 అపర్చర్ గల ఒక ప్రధాన 16MP కెమెరాకి జతగా, 8MP సూపర్ వైడ్ యాంగిల్ కెమేరా మరియు 2MP డెప్త్ కెమేరాలను కలిపి ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పుగా అందించారు. ఒక సెల్ఫీ విభాగానికి వస్తే, ఇందులో ఒక 32MP సెల్ఫీ కెమేరాని అందించారు. ఈ ఫోన్, ఒక పంచ్ హోల్ డిజైన్ మరియు పవర్ ఫుల్ బ్యాటరీతో పాటుగా పవర్ ఫుల్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలతో పూర్తిగా లోడ్ చేయబడినట్లు, కంపెనీ దీని గురించిన టీజింగును అందించింది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo