వివో Z 1 ప్రో vs షావోమి రెడ్మి నోట్ 7 ప్రో : పూర్తి సరిపోలిక

వివో Z 1 ప్రో  vs షావోమి రెడ్మి నోట్ 7 ప్రో : పూర్తి సరిపోలిక
HIGHLIGHTS

ఏ ఫోన్ మంచి స్పెక్స్‌ను అందిస్తుందో తెలుసుకోవచ్చు.

ఇటీవల, వివో భారతదేశంలో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ అయినటువంటి, Z1 ప్రో ని విడుదల చేసింది. ఈ ఫోన్ ఒక పంచ్ హోల్ కెమేరా మరియు వెనుక ట్రిపుల్ కెమెరాలతో పాటుగా గొప్ప ప్రాసెసరుతో వస్తుంది. అయితే, ఈ ఫోన్ను అదే ధరలో గొప్ప కెమేరాలు మరియు మంచి ప్రాసెసెరుతో షావోమి తీసుకొచ్చినటువంటి రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోనుతో సరిపోల్చి చూద్దాం.  తద్వారా, ఏ ఫోన్ మంచి స్పెక్స్‌ను అందిస్తుందో తెలుసుకోవచ్చు.

Display ( డిస్ప్లే )

ఈ రెండు స్మార్ట్ ఫోనుల డిస్ప్లేల గురించి చూస్తే, షావోమి రెడ్మి నోట్ 7 ప్రో లో మీకు 1080X2340 రిజల్యూషన్ అందించగల ఒక 6.30 అంగుళాల FHD+ వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో అందుతుంది. ఈ ఫోన్ యొక్క స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో అందించబడింది. ఇక వివో Z1 ప్రో విషయానికి వస్తే ఇది కొంచం పెద్దదైన  ఒక 6.53-అంగుళాల FHD + (1080×2520 పిక్సెల్స్) డిస్ప్లేతో వస్తుంది. అయితే, ఈ స్మార్ట్ ఫోనులో మీకు ఒక పంచ్ హాల్ డిజైన్ అందుతుంది.ఏ స్మృతి ఫోనులో ఎటువంటి గ్లాస్ వాడారన్న విషయం ఇంకా తెలియరాలేదు.  

Camera ( కెమేరా )

షావోమి రెడ్మి నోట్ 7 ప్రో ఒక డ్యూయల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. అయితే, దీని యొక్క ప్రధాన వెనుక కెమెరా 48 మెగాపిక్సెల్స్ f / 1.7 ఎపర్చరుతో మరియు జతగా 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా  f / 2.2 ఎపర్చరు తో వస్తుంది. ముందు భాగంలో,  ఈ ఫోన్ ఒక 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. మరొకవైపున, వివో Z1 ప్రో లో మీకు ఒక ట్రిపుల్ కెమేరా సెటప్ అందుతుంది. ఇందులో,  16 MP + 8 MP +2MP సెన్సార్లు కలిగిన  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లభిస్తోంది మరియు ఈ ఫోన్ ముందుభాగంలో సెల్ఫీ కోసం ఒక 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Processor ( ప్రాసెసర్ )

షావోమి రెడ్మి నోట్ 7 ప్రో  2.0GHz క్లాక్ స్పీడ్ అందించగల ఒక స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా-కోర్ 11nm ప్రాసెసరుతో వస్తుంది. ఇది 4GB,6GB RAM మరియు 64/128GB స్టోరేజి  ఎంపికలతో వస్తుంది. ఇక వివో Z1 ప్రో విషయానికి వస్తే, ఈ ఫోన్ ఒక సరికొత్త స్నాప్ డ్రాగన్ 712 ఆక్టా కోర్ 10nm ప్రాసెసర్ మరియు మల్టి టర్బో టెక్నాలజీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా 4GB,6GB RAM మరియు 64/128GB స్టోరేజి ఎంపికలతో వస్తుంది.

Battery బ్యాటరీ

షావోమి రెడ్మి నోట్ 7 ప్రో, క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4.0 టెక్నాలజీకి సపోర్టు చేసే ఒక 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు టైప్ C ఛార్జింగ్ పోర్టుతో వస్తుంది. వివో Z1 ప్రో స్మార్ట్ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు గల ఒక పెద్ద 5,000 mAh బ్యాటరి మరియు మైక్రో USB తో వస్తుంది. అలాగే, ఇది ఒక OTG రివర్స్ ఛార్జింగ్ టెక్నలాజితో వస్తుంది అంటే ఇది ఇతర ఫోన్లను కూడా దీనితో ఛార్జ్ చేసుకోవచ్చు.     

OS ( ఆపరేటింగ్ సిస్టం )

రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 9 పై ఆధారపడి ఉంటాయి కాని షావోమి రెడ్మి నోట్ 7 ప్రో (MIUI 10) తో అందిస్తుంది. అయితే, వివో Z1 ప్రో ఫన్ టచ్ OS 9.0 ఆధారితంగా పనిచేస్తుంది.

SAR Value

రెడ్మి నోట్ 7 ప్రో

HEAD : 0.962 W/kg   

Body   : 0.838 W/kg   

వివో Z1 ప్రో

HEAD : 0.752 W/kg   

Body   : 0.402 W/kg

Price ( ధర )

షావోమి రెడ్మి ధరలు

షావోమి రెడ్మి నోట్ 7 ప్రో  : ( 4GB + 32GB ) – Rs.13,999 

షావోమి రెడ్మి నోట్ 7 ప్రో  : ( 6GB + 64GB ) – Rs.15,999 

షావోమి రెడ్మి నోట్ 7 ప్రో  : ( 6GB + 128GB ) – Rs.16,999

వివో Z1 ప్రో ధరలు   

వివో Z1 ప్రో  : ( 4GB + 32GB )  – Rs.14,990 

వివో Z1 ప్రో  : ( 6GB + 64GB )  – Rs.16,990 

వివో Z1 ప్రో  : ( 6GB + 128GB ) – Rs.17,990

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo