8GB+8GB ర్యామ్ ఫీచర్ తో కొత్త ఫోన్ లాంఛ్ చేసిన వివో..!!

HIGHLIGHTS

వివో ఈరోజు తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ViVO Y35 ని ఇండియాలో విడుదల చేసింది

వివో ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను కేవలం సింగిల్ వేరియంట్ తో మాత్రమే విడుదల చేసింది

ఈ ఫోన్ లో 8GB ర్యామ్ తో పాటుగా 8GB ఎక్స్ టెండేడ్ ర్యామ్ ఫీచర్ ను కూడా జతచేసింది

8GB+8GB ర్యామ్ ఫీచర్ తో కొత్త ఫోన్ లాంఛ్ చేసిన వివో..!!

వివో ఈరోజు తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ViVO Y35 ని ఇండియాలో విడుదల చేసింది. వివో ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను కేవలం సింగిల్ వేరియంట్ తో మాత్రమే విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ లో 8GB ర్యామ్ తో పాటుగా 8GB ఎక్స్ టెండేడ్ ర్యామ్ ఫీచర్ ను కూడా జతచేసింది. అంతేకాదు, EIS సపోర్ట్ కలిగిన 50MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 44W  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లతో కూడా ఈ ఫోన్ ను ఇండియన్ మర్కెట్లో పరిచయం చేసింది. ఈ సరికొత్త వివో స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు ఫీచరు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.                    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ViVO Y35: ధర మరియు ఆఫర్లు

 వివో వై35 స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగిన సింగిల్ వేరియంట్ తో వస్తుంది మరియు దీని ధర రూ.18,499. ఈ ఫోన్ వివో స్టోర్ మరియు అన్ని రిటైల్ అవుట్ లెట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ఫోన్ ను SBI, Kotak మరియు ICICI  బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి రూ.1,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

ViVO Y35: స్పెసిఫికేషన్స్

ViVO Y35 స్మార్ట్ ఫోన్ 6.58- ఇంచ్ FHD+ (2408 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేని కలిగివుంది మరియు ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. వివో వై35 స్మార్ట్ ఫోన్ 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో,  క్వాల్కమ్ పవర్ ఫుల్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 680 SoC శక్తితో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 పై ఆధారపడి FuntouchOS 12 పై నడుస్తుంది.

వివో వై35  వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో EIS సపోర్ట్ కలిగిన 50 ఎంపి ప్రాధమిక కెమెరా, 2 ఎంపి బొకే సెన్సార్ మరియు 2 ఎంపి మ్యాక్రో సెన్సార్ ఉంటాయి. ముందు వైపు, 16MP సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. Y35 స్మార్ట్ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ అగేట్ బ్లాక్ మరియు డాన్ గోల్డ్ అనే రెండు కలర్ అప్షన్ లో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo