HIGHLIGHTS
Vivo Y35 4G పోస్టర్ లీక్
వివో వై35 4G గోల్డ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వస్తున్నట్లు కనిపిస్తోంది
50MP కెమెరా మరియు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
వివో గత వారం ఇండియాలో విడుదల చేసిన Vivo Y35 4G స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు ఇండియాలో విడుదల చేయ్యడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అధికారిక లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు. అయితే, మాహేష్ టెలికాం లీక్ చేసిన అధికారిక పోస్టర్ తరువాత ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ అతి త్వరలో జరగనున్నదని అర్ధమవుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క కొన్ని వివరాలు కూడా తెలియ వస్తున్నాయి.
Surveyమాహేష్ టెలికాం లీక్ చేసిన ఈ పోస్టర్ ద్వారా, వివో వై35 4G స్మార్ట్ ఫోన్ గోల్డ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 50MP కెమెరా మరియు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుందని నిర్ధారనయ్యింది. ఈ ఫోన్ ను 15000 రూపాయల బడ్జెట్ లో ఇండియాలో ప్రకటించవచ్చని ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది.
ఇక వివో వై35 4G స్పెక్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ FHD+ రిజల్యూషన్ పెద్ద 6.58-అంగుళాల డిస్ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 680 SoC కి జతగా 8GB RAM మరియు 256GB వరకు స్టోరేజ్ (1TB వరకు బాహ్య మెమరీ) కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఇందులో, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ బోకె సెన్సార్ ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 12 ఆధారితమైన Funtouch 12 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile