వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ పైన 20 వేల పైన డిస్కౌంట్ అఫర్.!

HIGHLIGHTS

Vivo ప్రీమియం స్మార్ట్ ఫోన్ పైన Flipkart అతి భారీ డిస్కౌంట్ ప్రకటించింది

వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది

వివో స్మార్ట్ ఫోన్ పైన 21 వేల రూపాయలకు పైగా భారీ డిస్కౌంట్

వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ పైన 20 వేల పైన డిస్కౌంట్ అఫర్.!

వివో ప్రీమియం సిరీస్ ఫోన్లు గా పేరొందిన X సిరీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పైన Flipkart అతి భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ అతి భారీ డిస్కౌంట్ తో ఈ వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది. Flipkart ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ వివో బెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ అఫర్ మరియు ఫోన్ ఫీచర్లు తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వివో యొక్క x సిరీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ vivo X80 pro స్మార్ట్ ఫోన్ పైన Flipkart ఈ అఫర్ ను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ సింగిల్ వేరియంట్ తో రూ. 79,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 21 వేల రూపాయలకు పైగా భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 57,890 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. 

Flipkart ఈ వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ పైన భారీ బ్యాంక్ అఫర్ లను కూడా జత చేసింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో ఈ ఫోన్ కొనేవారికి రూ. 3,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, vivo X80 pro స్మార్ట్ ఫోన్ రూ. 54,890 అఫర్ ధరకే పొందే వీలుంది. Buy From Here

vivo X80 pro: ప్రత్యేకతలు 

ఈ వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్, కెమేరా, డిస్ప్లే మరియు బ్యాటరీ వంటి అన్ని విభాగాల్లో కూడా ప్రీమియం సెటప్ ను కలిగి వుంది మరియు ఈ ఫోన్ ధరకు తగిన న్యాయం చేస్తుంది.  ఈ ఫోన్ 6.78-inch బిగ్ AMOLED డిస్ప్లేని LTPO 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3200×1440 (WQHD+) రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లే మీకు అత్యద్భుతమైన విజువల్స్ ను మీకు అందిస్తుంది. 

ఈ వివో ఫోన్ Snapdragon 8 Gen 1 ప్రోసెసర్ కి జతగా 12GB ర్యామ్ మరియు  256GB స్టోరేజ్ తో అద్భుతమైన పెర్ఫార్మెన్ అందిస్తుంది. ఈ ఫోన్ 4700mAh బ్యాటరీని 80W ఫ్లాష్ ఛార్జ్ మరియు 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగి వుంది. 

ఈ ఫోన్ లో భారీ కెమేరా సెటప్ కూడా వుంది. vivo X80 pro స్మార్ట్ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమేరా మరియు (50MP) + (48MP) + (12MP) + (8MP) రియర్ కెమేరా సెటప్ వుంది. ఇందులో అనేకమైన కెమేరా ఫిల్టర్ లను మరియు అప్షన్ లను కూడా వివో జత చేసింది. ఈ ఫోన్ కెమేరాతో అద్భుతమైన ఫోటోలను మరియు వీడియోలను మీరు చిత్రీకరించవచ్చు. 

ఓవరాల్ గా ఈ vivo X80 pro డబ్బుకు తగిన విలువను అందించే ఫోన్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo