Vivo X300 Ultra launched in India know the price and features
Vivo X300 Ultra: వివో లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ను క్లవర్ డిజైన్ మరియు అల్ట్రా క్లియర్ కెమెరాతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ చూడటానికే కాదు ఫోటోలు మరియు వీడియోలు కూడా DSLR కెమెరాని తలదన్నేలా ఉంటుంది. వివో సరికొత్తగా అందించిన ఈ లేటెస్ట్ ప్రీమియం ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ మరియు ప్రైస్ వివరాలు ఎలా ఉన్నాయో క్లియర్ గా తెలుసుకుందామా.
వివో ఈ ఫోన్ ను 6.83 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లేతో లాంచ్ చేసింది. ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ మరియు QHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు HDR10+ సపోర్ట్ మరియు చాలా హై బ్రైట్ నెస్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 తో లాంచ్ చేసింది. ఇది గరిష్టంగా 4.6GHz వరకు పవర్‌ఫుల్ కోర్స్ కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్ కి జతగా 16GB LPDDR5X ర్యామ్ మరియు గరిష్టంగా 512GB స్టోరేజ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
వివో ఎక్స్ సిరీస్ అంటేనే కెమెరా ప్రత్యేకమైన ఫోన్. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి గొప్ప కెమెరా సెటప్ తో ఫోన్ లను అందించిన వివో, ఇప్పుడు ఈ ఫోన్ మరింత గొప్ప కెమెరా సిస్టంతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం ఉంటుంది. ఇందులో 200MP (Sony) ప్రధాన కెమెరా, 200MP పెరిస్కోప్ కెమెరా మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరా వంటి పవర్ ఫుల్ కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ అన్ని కెమెరాలు కూడా OIS సపోర్ట్ మరియు ZEISS ఆప్టిక్స్ కలిగి ఉంటాయి.
ఈ అల్ట్రా ప్రీమియం కెమెరా సెటప్ తో ఈ ఫోన్ 8K వీడియో సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 120FPS వద్ద 4K వీడియో రికార్డింగ్, Dolby Vision మరియు 10-bit LOG వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది నిజంగా DSLR లెవల్ ఫోటోలు అందిస్తుందని వివో తెలిపింది. ఇందులో లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు ప్రత్యేకమైన వివో ఫిల్టర్లు కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.
ఇక బ్యాటరీ విభాగానికి వస్తే, ఈ ఫోన్ లో 6600mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ Origin OS తో లాంచ్ అయ్యింది మరియు 7 సంవత్సరాల అప్డేట్స్ అందుకుంటుంది. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు ZEISS టెలిఫోటో ఎక్స్ టెండర్ సపోర్ట్ తో కూడా వస్తుంది.
Also Read: భారీ 500W సబ్ ఉఫర్ తో 5.1 Dolby సౌండ్ బార్ లాంచ్ చేసిన జెబ్రోనిక్స్.!
వివో ఎక్స్ 300 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను రూ. 1,59,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం 16GB + 512GB సింగల్ వేరియంట్ లో అందించింది. అయితే, ఈ ఫోన్ తో ప్రత్యేకంగా అందించిన ఫోటో గ్రాఫర్ కిట్ తో వచ్చే వేరియంట్ కోసం రూ. 2,09,999 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది.
వివో ఇప్పటికే ఈ ఫోన్ ప్రీ బుకింగ్ స్టార్ట్ చేసింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి ఈ ఫోన్ ను ప్రీ బుక్ చేసుకోవచ్చు. 14వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది.
ఈ స్మార్ట్ ఫోన్ పై వివో చాలా భారీ ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ పై HDFC, SBI, Axis మరియు UPI పేమెంట్ పై 10% ఫ్లాట్ డిస్కౌంట్ అందించింది. అంటే, ఈ ఫోన్ పై రూ. 16,000 నుంచి రూ. 21,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకునే అవకాశం వివో అందించింది. 1 సంవత్సరం అదనపు వారంటీ, 24 నెలల నో కాస్ట్ EMI మరియు టెలిఫోటో ఎక్స్ టెండర్ మరియు గ్రిప్ పై రూ. 4,000 రూపాయల అదనపు తగ్గింపు ఆఫర్ కూడా అందించింది.