Vivo X300 Series ఇండియా లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా ఈరోజు వివో రివీల్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ ఫీచర్స్ మరియు జబర్దస్ కెమెరా సెటప్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ తో పాటు సూపర్ జూమ్ అందించే జూమ్ సెటప్ కూడా విడుదల చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు ఏమిటో ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Vivo X300 Series : లాంచ్ డేట్
వివో X300 సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఈ సిరీస్ ను ఇండియన్ మార్కెట్లో డిసెంబర్ 2వ తేదీ లాంచ్ చేస్తుంది. ఈ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా విడుదల చేసింది.
వివో X300 సిరీస్ నుంచి అందించే స్మార్ట్ ఫోన్ లను మీడియాటెక్ పవర్ ఫుల్ చిప్ సెట్ Dimensity 9500 చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది. దీనికి జతగా VS1 మరియు V3+ చిప్ ద్వయంతో గొప్ప ఇమేజ్ ప్రాసెస్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ అల్టిమేట్ పెర్ఫార్మన్స్ ఆఫర్ చేస్తుందని వివో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ తో లాంచ్ అవుతుంది.
ఈ సిరీస్ నుంచి అందించే ఎక్స్ 300 స్మార్ట్ ఫోన్ లో 200MP ZEISS మెయిన్ కలిగిన క్వాడ్ కెమెరా ఉంటుంది మరియు ఎక్స్ 300 ప్రో స్మార్ట్ ఫోన్ లో 200MP ZEISS APO టెలిఫోటో కెమెరా కలిగిన క్వాడ్ రియర్ కెమెరా ఉంటాయి. ఎక్స్ 300 ప్రో స్మార్ట్ ఫోన్ సూపర్ జూమ్ సపోర్ట్, 4K 120FPS డాల్బీ విజన్ కెమెరా సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ అల్ట్రా ప్రీమియం డిజైన్ తో ఉంటుంది. వివో ఎక్స్ 300 ప్రో స్మార్ట్ ఫోన్ తో పాటు సూపర్ జూమ్ అందించే ఫోటోగ్రాఫర్ కిట్ ను కూడా అందిస్తుంది. స్మార్ట్ ఫోన్ ఈ కొత్త సెటప్ తో DSLR వంటి జబర్దస్త్ ఫోటోలు మరియు మరింత క్లారిటీ కలిగిన జూమ్ అందిస్తుంది. ఇది చాలా దూరంలో ఉన్న సబ్జెక్ట్ ను సైతం మంచి క్లారిటీ తో చిత్రిస్తుంది.