ViVO V27 Pro: భారీ ఆఫర్లతో సేల్ కి అందుబాటులోకి వచ్చిన వివో కొత్త ఫోన్.!

HIGHLIGHTS

VIVO V27 Pro మంచి ఆఫర్లతో సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈ స్మార్ట్ ఫోన్ తో పాటుగా చాలా ఆఫర్లను జత చేసింది

ఈ ఆఫర్ల ద్వారా ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు

ViVO V27 Pro: భారీ ఆఫర్లతో సేల్ కి అందుబాటులోకి వచ్చిన వివో కొత్త ఫోన్.!

వివో ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ VIVO V27 Pro మంచి ఆఫర్లతో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. లాంచ్ సమయంలో వివో ఈ స్మార్ట్ ఫోన్ తో పాటుగా చాలా ఆఫర్లను జత చేసింది. ఈ ఆఫర్ల ద్వారా ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప కెమెరా ఫీచర్లతో పాటుగా కొత్త Aura Lite ని కూడా కలిగివుంది. ఈ లేటెస్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఆఫర్లను గురించి వివరంగా తెలుసుకోండి.            

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ViVO V27 Pro: ధర మరియు ఆఫర్లు

 వివో వి27 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB /128GB స్టోరేజ్ ధర రూ.37,999 మరియు 8GB /256GB స్టోరేజ్ ధర రూ.39,999. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ధర రూ.42,999. ఈ ఫోన్ పైన కంపెనీ లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. HDFC/ICICI/KOTAK బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ కార్డ్స్ మరియు EMI అప్షన్ తో ఈ ఫోన్ కొనేవారికి రూ.3,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, పాత ఫోన్ ఎక్స్చేంజ్ పైన 2,500 రూపాయల బోనస్ వంటి ఆఫర్లను అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను వివో అధికారిక వెబ్సైట్ మరియు Flipkart తో పాటుగా ఆఫ్ లైన్ స్టోర్స్ నుండి కూడా లభిస్తుంది.   

ViVO V27 Pro: స్పెసిఫికేషన్స్

ViVO V27 Pro: స్మార్ట్ ఫోన్ 6.78-అంగుళాల FHD+ (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ కలిగిన 3D కర్వ్డ్ డిస్ప్లేని కలిగివుంది మరియు ఇది  AMOLED ప్యానెల్‌ను ఉపయోగించింది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కలర్ ఛేంజింగ్ గ్లాస్ ను అందించింది. వి 27 ప్రో 12 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్‌జతగా మీడియాటెక్ పవర్ ఫుల్ ప్రాసెసర్ Dimensity 8200 శక్తితో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 OS ఆధారితమైన FuntouchOS 13 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.

వివో వి 27 ప్రో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP (OIS) Sony IMX766V ప్రాధమిక కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉంటాయి. అయితే,ఈ ఫోన్ లో నైట్ పోర్ట్ రైట్ ఫోటోలను అందించడం కోసం Aura Lite ని అందించింది. ముందు వైపు, 50MP భారీ సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోనులో వివో అందించింది. V27 ప్రో 66W ఫ్లాష్ ఛార్జ్  సపోర్ట్ కలిగిన 4,600mAh బ్యాటరీతో వస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile