VIVO V 19 గొప్ప ఫీచర్లతో విడుదలయ్యింది

VIVO V 19 గొప్ప ఫీచర్లతో విడుదలయ్యింది
HIGHLIGHTS

VIVO V19 8GB RAM మరియు 128GB స్టోరేజితో జతచేయబడుతుంది.

VIVO V 19 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది. ఈ సరికొత్త స్మార్ట్‌ ఫోన్ను మార్చి 26 న భారత్‌ లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, భారతదేశంలో కరోనావైరస్ లాక్ డౌన్ కారణంగా వివో వి 19 యొక్క విడుదలనునిలిపివేసింది. ఈ ఫోన్ యొక్క ప్రత్యేక ఫీచర్లుగా 48MP క్వాడ్ కెమెరా, స్నాప్‌ డ్రాగన్ 712 SoC మరియు 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి వాటి గురించి చెప్పవచ్చు.

ఈ వివో వి 19 ఒక పంచ్-హాల్ డిస్ప్లే డిజైన్‌ ను కలిగి ఉంది మరియు ఈ ఫోన్ ఒక 6.44-అంగుళాల FHD + డిస్ప్లేను 2400 x 1080 పిక్సెళ్ల రిజల్యూషన్‌ తో కలిగి ఉంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే. ఇందులో, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇది కాకుండా, ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగన్ 712 SoC యొక్క శక్తితో వస్తుంది మరియు 8GB RAM మరియు 128GB స్టోరేజితో జతచేయబడుతుంది.

మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఈ హ్యాండ్‌ సెట్‌ ను 128 జీబీ వరకూ పెంచవచ్చు. ఈ ఫోనులో ముందు ఒక 32 మెగాపిక్సెల్ పంచ్-హోల్ కెమెరా ఉంది. ఇది కాకుండా, ఈ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్స్ ప్రాధమిక కెమెరాతో క్వాడ్ కెమెరా ఉంది మరియు దాని ఎపర్చరు ఎఫ్ / 1.8 మరియు ఇది ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్‌ (PDAF)తో వస్తుంది.

రెండవ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ డేడికేటెడ్ మ్యాక్రో సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ పై ఆధారంగా ఈ ఫోన్ ఫన్‌టచ్ ఓఎస్ 9.2 తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ సిల్వర్ మరియు గ్లీమ్ బ్లాక్ వంటి రెండు సొగసైన రంగుల ఎంపికలలో వస్తుంది. ఈ చైనీస్ బ్రాండ్ ప్రతి మార్కెట్‌కు ప్రత్యేక ధరను అఫర్ చేస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo