చాలా తక్కువ ధరకే లాంచ్ అయిన VIVO U10 : ట్రిపుల్ కెమేరా, 5000 mAh బ్యాటరీ ఇంకా మరెన్నో

HIGHLIGHTS

ఈ వివో యు 10 లో AI ట్రిపుల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు వస్తున్నాయి.

చాలా తక్కువ ధరకే లాంచ్ అయిన VIVO U10 : ట్రిపుల్ కెమేరా, 5000 mAh బ్యాటరీ ఇంకా మరెన్నో

చాల రోజులనుండి టీజ్ చెస్తున్నటువంటి, వివో U10 స్మార్ట్‌ ఫోన్ను ఈ రోజు భారతదేశంలో విడుదల చేసింది. ముందునుండే అంచావేస్తునట్లుగా, ఈ స్మార్ట్ ఫోన్ను   కేవలం రూ .8,990 రూపాయల ప్రారంభ ధర వద్ద విడుదలకి చేసింది. ఈ వివో యు 10 లో AI ట్రిపుల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు వస్తున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

VIVO U10 ప్రత్యేకతలు

ఈ వివో యు 10 ఒక పెద్ద 6.35-అంగుళాల HD + ఐపిఎస్ డిస్‌ప్లేతో లాంచ్ చేయబడింది మరియు ఈ ఫోన్ ఎలక్ట్రిక్ బ్లూ మరియు థండర్ బ్లాక్ వంటి రెండు మంచి కలర్ రంగులలో అందించబడుతోంది. ఇవి కాకుండా, ఒక పెద్ద 5000 mAh బ్యాటరీ కూడా ఈ ఫోనులో అందించబడింది, ఇది 18w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665AIE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి, ఈ ఫోన్ అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది, అలాగే ఫోనులో డార్క్ మోడ్‌ ని కూడా అందించారు.

కెమెరా విభాగం గురించి మాట్లాడితే, ఈ ఫోన్ వెనుక భాగంలో AI ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 13 MP ప్రాధమిక కెమెరా మరియు దానికి జతగా ఒక 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు మూడవదిగా  2 MP  డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.

VIVO U10 :  ధర మరియు సేల్

వివో యు 10 యొక్క సాధారణ వేరియంట్ రూ .8,990 నుండి ప్రారంభమవుతుంది, ఇది 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ తో ఉంటుంది. ఇది కాకుండా, రూ .9,990 ధరతో 3 జీబీ + 64 జీబీ వేరియంట్ మరియు 4 జీబీ + 64 జీబీ వేరియంట్ ను రూ .10,990 రూపాయల ధరతో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి అమ్మకం సెప్టెంబర్ 29 న అమెజాన్ ఇండియా మరియు వివో యొక్క ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రారంభమవుతుంది. అలాగే లాంచ్ ఆఫర్ కింద, ఈ ఫోన్ను SBI  కార్డుతో కొనుగోలు చేసేవారికి 10% తక్షణ డిస్కౌంట్ అందుతుంది మరియు 6 నెలల వరకు వడ్డీ ఖర్చు లేకుండా No Cost EMI ద్వారా కూడా ఈ ఫోన్ను  కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile