Vivo T5x 5G launched with stunning features under 20k in India
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఈరోజు తన T సిరీస్ నుంచి 2026 లేటెస్ట్ ఫోన్ Vivo T5x 5G ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ అయిన ప్రైస్ సెగ్మెంట్ లో ఎప్పుడూ చూడని స్టన్నింగ్ ఫీచర్స్ తో ఈ వివో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో పవర్‌ఫుల్ ఫీచర్లతో అందించింది. ముఖ్యంగా, ఈ ఫోన్ ను 7200 mAh భారీ బ్యాటరీ మరియు 1 Mn+ AnTuTu అందించే లేటెస్ట్ ప్రోసెసర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ తో అందించింది.
వివో ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ప్రైస్ వివరాలు ఈ క్రింద చూడవచ్చు.
వివో టి 5x 5G (6GB + 128GB) ప్రైస్ : రూ. 18,999
వివో టి 5x 5G (8GB + 128GB) ప్రైస్ : రూ. 20,999
వివో టి 5x 5G (8GB + 256GB) ప్రైస్ : రూ. 22,999
ఈ స్మార్ట్ ఫోన్ సైబర్ గ్రీన్ మరియు స్టార్ సిల్వర్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా వివో జత చేసింది. ఈ ఫోన్ పై Axis, HDFC మరియు SBI కార్డ్ ఆప్షన్ తో రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్ పై 6 నెలల వరకు No Cost EMI ఆఫర్ ను కూడా వ్ వివో అందించింది.
Also Read: Samsung Galaxy M17e 5G: బడ్జెట్ యూజర్ ని ఆకర్షించే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
వివో టి 5x 5G స్మార్ట్ ఫోన్ డ్రాప్ రెసిస్టెన్స్ కలిగిన మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో వస్తుంది. ఈ ఫోన్ 6.76 ఇంచ్ LCD కెపాసిటివ్ టచ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్, FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో Dimensity 7400-Turbo తో లాంచ్ అయ్యింది. ఈ ప్రోసెసర్ కి జతగా 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 8 జీబీ అదనపు ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ ను కూడా అందించింది. ఈ ఫోన్ 1 Mn+ AnTuTu స్కోర్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ వివో లేటెస్ట్ ఫోన్ Origin OS 6.0 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో పని చేస్తుంది.
కెమెరా పరంగా, 50 MP (Sony IMX852) మరియు జతగా 2MP బొకే సెన్సార్ తో డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది మరియు ముందు 32 MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ AI ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ బ్యాటరీ పరంగా చాలా అట్రాక్టివ్ గా నిలుస్తుంది. ఎందుకంటే, వివో ఈ ఫోన్ లో 7200 mAh అతి భారీ బ్యాటరీ అందించింది. అలాగే, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ ను IP68 అండ్ IP69 ఇండస్ట్రీ లీడింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్స్ తో కూడా అందించింది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. గేమింగ్ కోసం ఈ ఫోన్ లో 4D గేమ్ వైబ్రేషన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.