Vivo T5x 5G launch announced in India
Vivo T5x 5G: అతిపెద్ద మొబైల్ తయారీ కంపెనీ వివో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలు ప్రకటించింది. వివో యొక్క బడ్జెట్ సిరీస్ గా పేరొందిన T సిరీస్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతున్నట్లు వివో ప్రకటించింది. కేవలం ఈ ఫోన్ లాంచ్ గురించి మాత్రమే కాకుండా ఈ ఫోన్ యొక్క అతిపెద్ద ఫీచర్ ని కూడా ఈ ఫోన్ లాంచ్ అనౌన్స్ తో పాటు టీజ్ చేసింది.
వివో టి5x 5జి స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ‘అప్ కమింగ్ సూన్’ స్టేటస్ తో మాత్రమే టీజింగ్ చేస్తోంది. త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేస్తామని వివో ఆటపట్టిస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజర్ విడుదల చేసింది. ఈ టీజర్ పోస్టర్ లో ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ఒకటి రివీల్ కూడా చేసింది.
వివో టి5x 5జి స్మార్ట్ ఫోన్ 10 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే సెగ్మెంట్ ఫాస్ట్ చిప్సెట్ తో లాంచ్ అవుతుందని కంపెనీ టీజింగ్ చేసింది. ఈ ప్రాసెసర్ పేరు మాత్రం ఇంకా వెల్లడించలేదు. అంతేకాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఆరిజన్ OS జతగా లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంచ్ అవుతుందని కూడా చెబుతోంది. ప్రస్తుతానికి ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క ఈ రెండు వివరాలు మాత్రమే వివో వెల్లడించింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కొన్ని కీలక వివరాలు గురించి నెట్టింట్లో కొన్ని లీక్స్ తెలియజేస్తున్నాయి.
Also Read: Google Pixel 9a స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ భారీ డీల్స్ అందుకోండి.!
వివో యొక్క ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పై ఇప్పటికే ఆన్లైన్ లో నడుస్తున్న లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ Dimensity 7300 లేదా 7400 సిరీస్ ప్రాసెసర్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని కూడా కొన్ని లీక్స్ చెబుతున్నాయి. ఇది కాకుండా ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన కెమెరా కెమెరా సెటప్ మరియు ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్న భారీ బ్యాటరీ సెటప్ కూడా అందించే అవకాశం ఉంది.
ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ కూడా వివో త్వరలోనే అందించే అవకాశం ఉంది. కాబట్టి, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పై వచ్చిన లీక్స్ లో ఎన్ని ఫీచర్స్ నిజమయ్యే అవకాశం ఉందో కూడా త్వరలోనే తెలుస్తుంది. ఈ ఫోన్ కొత్త అప్‌డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.