Vivo T5 Lite Sale: భారీ సింగిల్ డే ఆఫర్స్ తో ఫస్ట్ సేల్ .. ఛాన్స్ ఈరోజు మాత్రమే.!
Vivo T5 Lite మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది
లాంచ్ ఆఫర్స్ లో భాగంగా కేవలం ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉండే భారీ సింగిల్ డే ఆఫర్స్ అందించింది
ఫస్ట్ డే ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లు ఈ ఫోన్ ను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు
Vivo T5 Lite Sale: వివో సరి కొత్తగా విడుదల చేసిన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ వివో టి5 లైట్ మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఆఫర్స్ లో భాగంగా కేవలం ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉండే భారీ సింగిల్ డే ఆఫర్స్ ఈ ఫోన్ పై వివో అందించింది. కాబట్టి, ఫస్ట్ డే ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లు ఈ ఫోన్ ను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
SurveyVivo T5 Lite Sale: ఆఫర్లు
వివో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ను ఫస్ట్ డే సేల్ కోసం అందించింది. HDFC, Axis మరియు SBI క్రెడిట్ కార్డ్ ఎంపికతో ఈ ఫోన్ తీసుకునే వారికి రూ. 1,500 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ని ఈ ఫోన్ పై జత చేసింది. ఈ ఫస్ట్ డే ఆఫర్ తో ఈ ఫోన్ మీకు కేవలం రూ. 18,499 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో ఈ ఫోన్ లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ కేవలం ఈ రోజు ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (4GB + 128GB) రూ. 19,999 ప్రైస్ తో, రెండో (6GB + 128GB) వేరియంట్ రూ. 21,999 ప్రైస్ తో మరియు హై ఎండ్ (6GB + 256GB) వేరియంట్ రూ. 24,999 ప్రైస్ తో లాంచ్ అయ్యాయి. అయితే, ఫస్ట్ సేల్ ఆఫర్స్ తో మరింత తక్కువ ధరలో లభిస్తాయి.
Also Read: Jio vs BSNL: అండర్ రూ. 1,000 ధరలో ఈ లాంగ్ అన్లిమిటెడ్ ప్లాన్లు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.!
Vivo T5 Lite : ఫీచర్స్
వివో T5 లైట్ 5G ఫోన్ 6.74 ఇంచ్ HD+ LCD స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. వివో ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 ప్రాసెసర్ తో అందించింది. ఇందులో 4GB / 6GB ర్యామ్ మరియు 128GB / 256GB స్టోరేజ్ ఎంపికలు అందించింది. యూజర్ బడ్జెట్ మరియు అవసరాన్ని బట్టి తగిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.
ఈ వివో లేటెస్ట్ 5జి ఫోన్ లో 50MP ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, సెల్ఫీ మరియు వీడియో కాల్స్ కోసం ముందు 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ వివో కొత్త ఫోన్ 6500 mAh భారీ బ్యాటరీ మరియు 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మంచి స్లీక్ డిజైన్ మరియు IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile