vivo T4 Lite launching as vivo most affordable 5g smartphone
vivo T4 Lite స్మార్ట్ ఫోన్ ను వివో యొక్క మోస్ట్ అఫర్డబుల్ వివో 5G ఫోన్ గా లాంచ్ మార్కెట్ లో పరిచయం చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ అప్డేట్ నుంచి ఈ కొత్త ప్రకటన చేసింది. ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ, పటిష్టమైన బాడీ మరియు వేగవంతమైన ప్రోసెసర్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని కూడా వివో టీజింగ్ చేస్తోంది.
వివో టి 4 లైట్ ఈ స్మార్ట్ ఫోన్ 6.74 ఇంచ్ స్క్రీన్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ స్క్రీన్ కళ్ళకు హాని కలిగించని TUV ఐ ప్రొటెక్షన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు మంచి రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ వివో ఫోన్ 4 లక్షల 33 వేల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ డ్యూయల్ 5జి SIM స్మార్ట్ పోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ వివో స్మార్ట్ ఫోన్ 50MP Sony మెయిన్ సెన్సార్ మరియు 2MP బొకే కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గొప్ప AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో స్మార్ట్ AI ఫీచర్ ను వివో అందించింది ఈ ఫీచర్ తో ఈ ఫోన్ గొప్ప AI సత్తా కలిగి ఉంటుందని వివో చెబుతోంది. ఈ ఫోన్ 6000 mAh భారీ బ్యాటరీ సపోర్ట్ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా వస్తుంది.
ఇక ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ మరియు SGS 5 స్టార్ యాంటీ ఫాల్ ప్రొటెక్షన్ తో సాలిడ్ గా తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ IP 64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.
Also Read: అండర్ రూ.3,000 బెస్ట్ 120W సౌండ్ బార్ డీల్స్ పై ఒక లుక్కేయండి.!
వివో ఈ స్మార్ట్ ఫోన్ ను జూన్ 24వ తేదీ ఇండియాలో లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ వివరాలు లాంచ్ తర్వాత కన్ఫర్మ్ అవుతాయి. అయితే, ఈ ఫోన్ అండర్ 15 వేల రూపాయల బడ్జెట్ ధరలో లాంచ్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు. మరి ఈ ఫోన్ ప్రైస్ ఎలా ఉంటుందో చూడాలి.