వివో ఇండియాలో సరికొత్త విడుదల vivo T1 5G యొక్క కొత్త వేరియంట్ సేల్ కి అందుబాటులోకి వచ్చింది. వివో రీసెంట్ గా తీసుకొచ్చింది ఈ వివో టి1 5G కొత్త సిల్కి వైట్ వేరియంట్ తో ఇప్పుడు మొత్తం మూడు కలర్ అప్షన్లలో లభిస్తుంది. వాస్తవానికి, లాంచ్ సమయంలో రైన్ బో ఫాంటసీ మరియు స్టార్ లైట్ బ్లాక్ అనే రెండు కలర్ అప్షన్ లలో మాత్రమే ఈ ఫోన్లను విడుదల చేసింది.ఈ ఫోన్ అందుకున్న క్రేజ్ మరియు అమ్మకాలను దృష్టిలో ఉంచుకొని వివో కొత్త సిల్కీ వైట్ కలర్ వేరియంట్ ను కూడా తీసుకొచ్చింది. ఈ ఫోన్ Flipkart బిగ్ బిలియన్ డేస్ సాల్ నుండి సేల్ మంచి ఆఫర్లతో లభిస్తోంది. ఈ ఫోన్ పూర్తి వివరాలను క్రింద చూడవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
vivo T1 5G: ధర మరియు ఆఫర్లు
వివో ఇటీవల vivo T1 5G సిల్కీ వైట్ వేరియంట్ కేవలం రూ.14,990 ప్రారంభ ధరతో లభిస్తోంది మరియు ఇది 4GB మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. మరొక వేరియంట్ 6GB మరియు 128GB స్టోరేజ్ ధర రూ.15,990. ICICI మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనేవారికి 10% భారీ తగ్గింపు కూడా లభిస్తుంది.
Vivo T1 5G స్మార్ట్ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ LCD డిస్ప్లేని కలిగివుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం నోచ్ కటౌట్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకూ మెమోరిని మరింతగా విస్తరించవచ్చు.
ఇక కెమెరాల విభాగంలో, వివో T1 5జి ఫోన్ 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన Funtouch OS 12 స్కిన్ పైన నడుస్తుంది.