vivo S2 FE మిడ్ రేంజ్ ధరలో స్టన్నింగ్ ఫీచర్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

vivo S2 FE ను ఈరోజు వివో స్టన్నింగ్ ఫీచర్ తో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ చేసింది

వివో ఈరోజు నిర్వహించిన బిగ్ ఈవెంట్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

. ఈ ఫోన్ Sony కెమెరా మరియు 10,000 mAh భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో లాంచ్ అయ్యింది

vivo S2 FE స్మార్ట్ ఫోన్ ను ఈరోజు వివో స్టన్నింగ్ ఫీచర్ తో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ చేసింది. వివో ఈరోజు నిర్వహించిన బిగ్ ఈవెంట్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ Sony కెమెరా మరియు 10,000 mAh భారీ బ్యాటరీ వంటి జబర్దస్త్ ఫీచర్లతో లాంచ్ అయ్యింది. ఈ వివో కొత్త ఫోన్ కలిగిన ఆ స్టన్నింగ్ ఫీచర్స్ ఏమిటి మరియు ఈ ఫోన్ ప్రైస్ ఏమిటో ఒక లుక్కేద్దామా.

vivo S2 FE : ప్రైస్

వివో ఎస్ 2 FE స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 38,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 6GB + 128GB స్టార్టింగ్ వేరియంట్ ను ఈ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ 8GB + 128GB వేరియంట్ ను రూ. 42,999 రూపాయల ఆఫర్ ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్టెల్లార్ గ్రీన్, టైటాన్ బ్లాక్ మరియు జెన్ వైట్ మూడు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో భాగంగా భారీ అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ని కూడా వివో అందించింది. అక్టోబర్ 20వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది.

vivo S2 FE : ఫీచర్స్

వివో ఈ ఫోన్ ను 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ చిప్ సెట్ Dimensity 7300e తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS తో నడుస్తుంది.

ఈ ఫోన్ లో వెనుక గొప్ప కీంర్ సెటప్ ని వివో ఆఫర్ చేసింది. ఇందులో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా వుంది మరియు ఇందులో 50MP Sony మెయిన్ కెమెరా + 2MP సెకండరీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

Also Read: Vivo V80: న్యూ డిజైన్ అండ్ సినిమాటిక్ కెమెరా ఫీచర్స్ తో ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ గా వచ్చింది.!

ఈ ఫోన్ బ్యాటరీ ప్రత్యేకమైన ఫోన్ గా వచ్చింది. వివో ఈ ఫోన్ ఏకంగా 10,000 mAh భారీ బ్యాటరీతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ మంచి డ్యూరబిలిటీ ఫోన్ గా కూడా వచ్చింది. ఎందుకంటే, ఈ ఫోన్ 5MIL-STD టెస్ట్ తో ఉత్తీర్ణత సాధించింది. అంటే, ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ టెస్ట్ లను తట్టుకుని నిలబడింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :