Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో లాంచ్ అవుతున్న అప్ కమింగ్ ఫోన్స్.!

HIGHLIGHTS

Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో కొత్త ఫోన్లు ఇండియాలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి

ఈ చిప్ సెట్ 40 మిలియన్ AnTuTu స్కోర్ అందించే శక్తి కలిగి ఉంటుంది

స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ తో లాంచ్ కావడానికి రెండు ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి

Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో లాంచ్ అవుతున్న అప్ కమింగ్ ఫోన్స్.!

భారీ ఫీచర్స్ మరియు శక్తితో క్వాల్కమ్ లాంచ్ చేసిన Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో కొత్త ఫోన్లు ఇండియాలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ చిప్ సెట్ 40 మిలియన్ AnTuTu స్కోర్ అందించే శక్తి కలిగి ఉంటుంది మరియు ఈ శక్తికి తగిన ర్యామ్ ని జోడిస్తే ఆ ఫోన్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ అందిస్తుంది. మరి ఇంత శక్తివంతమైన చిప్ సెట్ తో ఇండియాలో మొదటగా విడుదల కావడానికి సిద్ధమైన ఆ ఫోన్లు ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Snapdragon 8 Elite Gen 5 : అప్ కమింగ్ ఫోన్స్

స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ తో లాంచ్ కావడానికి రెండు ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒకటి OnePlus 15 స్మార్ట్ ఫోన్ కాగా రెండోది iQOO 15 స్మార్ట్ ఫోన్. ఈ రెండు ఫోన్ల లాంచ్ గురించి వాటి కంపెనీలు టీజింగ్ మొదలు పెట్టాయి. ఈ రెండు ఫోన్ల లాంచ్ గురించి వాటి కంపెనీలు చెబుతున్న ఫీచర్స్ మరియు విశేషాలు ఏమిటో చూద్దామా.

Also Read: POCO F7 5G స్మార్ట్ ఫోన్ రూ. 4,000 భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

OnePlus 15

వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ కోసం సిద్దమయ్యింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ చైనా లాంచ్ తర్వాత ముందుగా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కాంపాక్ట్ డిజైన్ మరియు పవర్ ఫుల్ కెమెరా సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఆక్సిజన్ OS 16 సాఫ్ట్ వేర్ తో జతగా ఆండ్రాయిడ్ 16 OS తో కూడా వస్తుంది. ఈ ఫోన్ మరింత శక్తివంతమైన AI సపోర్ట్ తో ఉంటుందని వన్ ప్లస్ చెబుతోంది. ఈ ఫోన్ వచ్చే నెలలో ఇండియాలో లాంచ్ కావచ్చని చెబుతున్నారు.

Snapdragon 8 Elite Gen 5 Upcoming Phones

iQOO 15

ఐకూ యొక్క ఈ అప్ కమింగ్ ఫోన్ నవంబర్ నెలలో ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా కంపెనీ అందించిన టీజర్ ఇమేజెస్ ద్వారా ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అర్ధమవుతాయి. ఈ ఫోన్ కూడా స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ కూడా ప్రత్యేకమైన AI ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త ఫోన్ కూడా వివో యొక్క లేటెస్ట్ సాఫ్ట్ వేర్ ఆరిజిన్ OS 6 జతగా ఆండ్రాయిడ్ 16 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ పెద్ద కెమెరా బంప్, సూపర్ రిజల్యూషన్ కెమెరా మరియు అదిరిపోయే సరికొత్త డిజైన్ తో ఇండియా లో లాంచ్ అవుతుందని చెబుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo