మార్కెట్లోకి కొత్తగా రానున్న Vivo Y95 స్మార్ట్ ఫోన్
ఈ ఫోన్ 4,030 mAh బ్యాటరీ మరియు డ్యూయల్ కెమేరా మరియు వాటర్ డ్రాప్ నోచ్ ప్రత్యేకతలతో వస్తుంది.
వివో Y3 ని విడుదల చేసిన కొద్దికాలంలోనే, దీనికి కొనసాగింపుగా మరొక Vivo Y5 ని తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీ, డ్యూయల్ కెమేరా మరియు వాటర్ డ్రాప్ నోచ్ వంటి ప్రత్యేకతలతో వస్తుంది. ఇది మనకు, Y3 యొక్క అప్డేట్ తీసుకొచ్చింది వివో.
SurveyVivo Y95 స్పెసిఫికేషన్స్
ఈ వివో Y95 స్మార్ట్ ఫోన్ 720×1520 పిక్సెల్ రిజల్యూషతో ఒక 6.22 అంగుళాల HD+ వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లేని కలిగివుంటుంది మరియు ఇది 88.6% బాడీ టూ స్క్రీన్ రేషియాతో వస్తుంది. ఈ ఫోన్ క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా ప్రాసెసరుకి జతగా ఆడ్రినో 505 శక్తినిస్తుంది. ఇది 4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజితో వస్తుంది మరియు మైక్రో SD కార్డుతో దీని సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 OS ఆధారితంగా Fun Touch OS 4.5 తో నడుస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ఆప్టిక్స్ విషయానికివస్తే, ఇది సూపర్ క్లియర్ 13MP కెమేరాతో జతగా 2MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క రియర్ కెమేరా 140 వరకు సీన్స్ డిటెక్టు చేయగలదని కంపెనీ చెబుతోంది. అలాగే, ఒక LED ఫ్లాష్ కూడా ఈ కెమేరాకి క్రిందభాగంలో అందించబడింది. ముందుభాగంలో, AI బ్యూటీ కి సపోర్ట్ చేయగల ఒక 20MP సెల్ఫీ కెమేరాని పొందుతారు. ఈ ఫోను యొక్క వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అందించబడింది మరియు అధిక సామర్ధ్యం కలిగిన ఒక 4030mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.
ప్రస్తుతానికి, ఈ స్మార్ట్ ఫోన్ ఫిలిపైన్స్ లో అందుబాటులోకి వచ్చింది, ఇది PHP 13,999 (సుమారుగా Rs 19,100) ధరతో లభిస్తుంది. అయితే, ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు విడుదలవనున్నదనే విషయం ఇంకా వెల్లడికాలేదు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile