నోకియా 2.2 Vs రియల్మీ C2 Vs రెడ్మి7 : రూ. 7,000 ధరలో లభించే ఈ ఫోన్ల గురుంచి తెలుసుకోండి.

నోకియా 2.2 Vs రియల్మీ C2 Vs రెడ్మి7 : రూ. 7,000 ధరలో లభించే ఈ ఫోన్ల గురుంచి తెలుసుకోండి.
HIGHLIGHTS

ఇండియాలో అన్ని ప్రధాన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా ప్రీమియం ఫోన్ల తో పాటుగా తమ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కూడా ప్రత్యేకమైన ఫీచర్లతో అందిస్తున్నాయి.

ఇండియాలో అన్ని ప్రధాన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా ప్రీమియం ఫోన్ల తో పాటుగా తమ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కూడా ప్రత్యేకమైన ఫీచర్లతో అందిస్తున్నాయి. ఇటీవలి కాలంలో వచ్చినటువంటి, కొన్ని స్మార్ట్ ఫోన్లు కేవలం రూ.7,000 కంటే ధరలో మెచ్చుకోదగిన ఫీచర్లతో ఉంటాయి. వీటిలో ముఖ్యముగా, రియల్మీ C2, రెడ్మి7 మరియు నోకియా 2.2 గురించి చెప్పుకోవచ్చు. ఈ మూడు ఫోన్లు కూడావాటర్ డ్రాప్ నాచ్, పెద్ద బ్యాటరీ మరియు మంచి కెమేరా వంటి అన్ని ప్రత్యేకతలతో ఆకట్టుకుంటాయి. మరి అటువంటి స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.

నోకియా 2.2 : ప్రత్యేకతలు           

ఈ నోకియా 2.1 ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) ద్వారా అందించబడుతుంది.  ఈ నోకియా 2.2 ఆండ్రాయిడ్ 9 ఫై  యొక్క సాధారణ వెర్షన్ను కలిగి ఉంది, స్టాక్ Android తో . Android One లో భాగంగా, పరికరం తదుపరి రాబోయే రెండు సంవత్సరాల పాటు Android Q అలాగే భద్రతా అప్డేట్లుతో సహా, తదుపరి రెండు సంవత్సరాలు వెర్షన్ అప్డేట్ను స్వీకరిస్తుంది.

ఇది  2GB మరియు 3GB RAM ఎంపికలు మరియు 16GB మరియు 32GB స్టోరేజి ఎంపికలతో కలిపి ఒక మీడియా టెక్ హీలియో A22 SoC తో వస్తుంది. అదనంగా,  తొలగించదగిన ఒక  3,000 mAh బ్యాటరీతో పాటు ఉంటుంది. ముందు, ఒక పెద్ద 5.71 అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంది, దీనిలో 400 నిట  బ్రైట్నెస్ వరకూ ఉంటుంది. ఇది ఒక వాటర్ డ్రాప్  నోచ్ తో ప్రవేశపెట్టారు,  ఇది ముందు కెమెరాని కలిగి ఉంది, డిస్ప్లే అంచుల వరకు విస్తరించింది. అయితే MediaTek Helio A22 నిజంగా ఆ ధర పరిధిలో వేగమైన చిప్సెట్ మాత్రం కాదు. ఇది నాలుగు కోర్టెక్స్- A55 కోర్లతో 2GHz వద్ద క్లాక్ చేయబడిన ఒక క్వాడ్-కోర్ SoC తో ఉంది.

కెమెరా విభాగంలో, నోకియా 2.2 ఒక f / 2.2 ఎపర్చరు మరియు ఒక 1/3 "సెన్సార్ తో వెనుక ఒక 13MP కెమెరాతో వస్తుంది. ముందు ఒక  5MP సెల్ఫీ కెమెరా కూడా అందించారు.  నోకియా యొక్క యాజమాన్య AI ఇమేజింగ్ అల్గోరిథం "AI పవర్డ్ లో లైట్ కెమేరా ఫ్యూషన్ " అని పిలువబడుతుంది.  అదే AI ఇమేజింగ్ ఫీచర్ HDR ఫోటోలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది మరియు అది ఒక బ్యూటీ  మోడ్ తో  పాటుగా ఉంది. అలాగే ఫేస్ అన్లాక్ లాగా ముందు కెమెరా సహాయపడుతుంది.                

రియల్మీ C2 ప్రత్యేకతలు

రియల్మీ C2  స్మార్ట్ ఫోన్, ఒక 6.1 అంగుళాల HD డ్యూ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 89%  స్క్రీన్-టూ-బాడీ రేషియోని అందిస్తుంది. ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ మరియు వెనుక ఒక డైమండ్ కట్ డిజైన్ తో వస్తుంది.  అంతేకాదు,ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక హీలియో P 22 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా 2GB ర్యామ్ శక్తితో వస్తుంది.ఇది 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజితో వస్తుంది. అలాగే డ్యూయల్ SIM కార్డులతో పాటుగా ఒక SD మెమొరీ కార్డును కూడా ఒకేసారి వాడుకునేలా ట్రిపుల్ SIM స్లాట్ ఇందులో అందించారు.          

కెమేరాల విషయానికి వస్తే, వెనుక 13MP కెమేరాకు జతగా 2MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, ముందుభాగంలో ఒక 5MP  సెల్ఫీ కెమెరాతో ఉంటుంది మరియు ఇది 8 రకాల బ్యూటీ కస్టమ్ మోడ్లతోవస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా కలర్ OS 6 పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో వస్తుంది మరియు దీనితో వేగవంతంగా ఛార్జ్ చెయ్యవచ్చని సంస్థ చెబుతోంది. 

షావోమి రెడ్మి 7  ప్రత్యేకతలు

షావోమి రెడ్మి 7 స్మార్ట్ ఫోన్,  HD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.26 అంగుళాల డాట్ నోచ్ డిస్ప్లేతో అందించబడింది. ఈ ఫోన్ ఒక 19:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది మరియు ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో దీని స్క్రీన్ ప్రొటెక్ట్ చెయ్యబడింది. ఇది ఒక క్వాల్కమ్ స్నాప్డ్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రొసెసరు శక్తితో నడుస్తుంది.  ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 2GB ర్యామ్ జతగా 32GB స్టోరేజితో వస్తుంది. అధనంగా, ఒక SD కార్డు ద్వారా 512GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇది కమెట్ బ్లూ, ఎక్లిప్స్  బ్లాక్ మరియు లూనార్ రెడ్ వంటి కలర్ ఎంపికలతో  ఎంచుకునేలా లభిస్తుంది.

ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 12MP + 2MP  డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 12MP ప్రధాన కెమరా మరియు 2MP పోర్ట్రైట్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం ఒక 8MP AI కెమెరాని అందించారు. ఇందులో సెల్ఫీలను క్లిక్ చేయడం  పామ్ షట్టర్ అనే కొత్త ఫీచరుతో వస్తుంది. అధనంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక Pi2 టెక్నలాజితో వస్తుంది కాబట్టి, నీటి తుంపరలు మరియు హ్యుమిడిటీ నుండి రాకాశానను ఇసుంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo