మలేషియాలో ఈరోజు విడుదల కానున్న రెడ్మి నోట్ 9s

మలేషియాలో ఈరోజు విడుదల కానున్న రెడ్మి నోట్ 9s
HIGHLIGHTS

అధునాతన పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌తో లాంచ్ చేయవచ్చు.

షావోమి రెడ్మి నోట్ 9 s ను ఈరోజు సింగపూర్ మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ను మార్చి 23 అంటే ఈరోజు మలేషియా, పాకిస్తాన్‌ లో విడుదల చేయనున్నారు. ప్రారంభించటానికి ముందుగానే, ఈ స్మార్ట్ ఫోన్ రీబ్రాండెడ్ రెడ్మి నోట్ 9 ప్రో గా ఉంటుందని నిర్ధారించబడింది. అంటే, షావోమి గత వారం భారతదేశంలో విడుదల చేసినటువంటి రెడ్మి నోట్ 9 సిరీస్‌ వంటిది. అంతేకాదు విడుదల సమయంలో, మొదట భారతదేశంలో వీటిని లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు, ఈ చైనా స్మార్ట్‌ ఫోన్ తయారీదారు మరొక పేరుతో ఈ ప్రొడక్టును ఇతర మార్కెట్లకు విస్తరించడానికి సిద్ధంగా ఉంది.

షావోమి రెడ్మి నోట్ 9 ఎస్ మొబైల్ ఫోన్ను అధునాతన పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌తో లాంచ్ చేయవచ్చు. ఈ సంవత్సరం షావోమి తన ఫోన్లను సర్క్యులర్ కటౌట్‌తో లాంచ్ చేస్తోందన్న విషయం కూడా వెలుగులోకి వస్తోంది. ఇది కాకుండా, సంస్థ నుండి ఈ ఫోన్‌ లో,  బ్యాక్ కెమెరా సెటప్‌ గా చదరపు ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను ఇవ్వవచ్చు. అయితే, ఈ మొబైల్ ఫోన్ గురించి ఇతర సమాచారం బయటకు రావడం లేదు. రెడ్మి నోట్ 9 ఎస్ స్మార్ట్‌ ఫోన్ను రెడ్మి నోట్ 9 ప్రో మొబైల్ ఫోన్ యొక్క డౌన్ వేరియంట్‌గా లాంచ్ చేయవచ్చని కూడా చెబుతున్నారు.

ఇక ఇటీవల ఇండియాలో విడుదల చేసిన రెడ్మి నోట్ 9 ప్రో గురించి మాట్లాడితే, ఈ రెడ్మి నోట్ 9 ప్రో  ఒక 6.67 అంగుళాల పరిమాణంగల డాట్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది 2400×1080 పిక్సెళ్ళు అంటే FHD+ రిజల్యూషన్ తో వస్తుంది మరియు గరిష్టంగా 450 నిట్స్ బ్రైట్నెస్ అందిచే సామర్ధ్యంతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ప్రొటెక్షన్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్,  కొత్త ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 720G SoC శక్తితో పనిచేస్తుంది. ఇది 8nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది మరియు వేగంగా పనిచేస్తుంది. ఇది 618GPU తో వస్తుంది కాబట్టి గ్రాఫిక్స్ బాగా అనిపిస్తాయి మరియు గేమింగ్ మరింత ఆహ్లాదంగా ఉంటుంది. రెడ్మి నోట్ 9 ప్రో 4GB +64GB మరియు 6GB + 128GB వేరియంట్లలో లభిస్తుంది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, రెడ్మి నోట్ 9 ప్రో వెనుక 48MP+8MP+5MP+2MP గల క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ఇందులో 48MP ప్రధాన కెమేరా కాగా, 8MP వైడ్ యాంగిల్, 5MP మ్యాక్రో మరియు 2MP పోర్ట్రైట్ సెన్సార్లతో జతగా వస్తుంది. ఇక ముందుభాగంలో, రెడ్మి నోట్ 9 ప్రో ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమేరాని అందించింది. రెడ్మి నోట్ 9 ప్రో ఒక 5020mAh బ్యాటరీని, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది మరియు 18W ఛార్జర్ ని బాక్సుతో పాటుగా తీసుకువస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ MIUI 11 స్కిన్ పైనఆండ్రాయిడ్ 10 తో విడుదల చేసింది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo