రెడ్మి Y3 తో పాటుగా ఈరోజు విడుదలకానున్న REDMI 7 స్మార్ట్ ఫోన్

Updated on 24-Apr-2019
HIGHLIGHTS

రెడ్మి 7 స్మార్ట్ ఫోన్ మార్చి నెలలో చైనాలో విడుదలయ్యింది మరియు ఇది ఇప్పుడు ఇండియాలో కావడానికి సిద్దమవుతుంది.

ఈ రెడ్మి 7 MIUI 10 ఆధారితమైన Android 9 Pie మరియు 4,000mAh బ్యాటరీతో ఉంటుంది.

ఈరోజు రెడ్మి Y3 స్మార్ట్ ఫోన్, ఇండియాలో లాంచ్ కానున్న విషయం మనకు తెలిసిందే, అయితే ఈ ఫోనుతో పాటుగా షావోమి గతనెల చైనాలో విడుదల చేసినటువంటి  REDMI 7 స్మార్ట్ ఫోన్ను కూడా ఇండియాలో విడుదల చేయనునట్లు తెలుస్తోంది. అంటే, షావోమి అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్ అన్నమాట!. వాస్తవానికి, రెడ్మి 7 స్మార్ట్ ఫోన్ మార్చి నెలలో చైనాలో విడుదలయ్యింది  మరియు ఇది ఇప్పుడు ఇండియాలో కావడానికి సిద్దమవుతుంది.       

 ఈ రెడ్మీ 7 స్మార్ట్ ఫోన్, చైనాలో 2GB, 3GB మరియు 4GB RAM వేరియంట్లలో మరియు 16GB, 32GB మరియు 64GB అంతర్గత స్టోరేజి ఎంపికలతో విడుదలయ్యింది. ఈ  స్మార్ట్ ఫోన్ ఒక 6.26 అంగుళాల HD+ డిస్ప్లే ఒక 19:9 ఆస్పెక్ట్ రేషియాతో అందించబడింది.  అంతేకాకుండా, ఈ ఫోన్ యొక్క స్క్రీన్ ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షనుతో వస్తుంది.   

 ఇక కెమెరాల విషయానికి వస్తే,  వెనుకభాగంలో 12MP + 8MP సెన్సార్లతో ఒక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్పును కలిగి ఉంటుంది. ముందుభాగంలో, సెల్ఫీ కోసం 8MP  సెల్ఫీ కెమెరా అందించి. అదనంగా, ఈ పరికరం MIUI 10 ఆధారితమైన Android 9 Pie మరియు 4,000mAh బ్యాటరీతో  ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ వెనుకభాగంలో ఒక  వేలిముద్ర సెన్సార్ తో ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ వెనుక ప్యానెల్ చూడడానికి, రెడ్మీ నోట్ 7 సిరీస్ కి సమానంగా, ఒక గ్రేడియంట్ డిజైన్ తో ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :