రెడ్మి Y3 తో పాటుగా ఈరోజు విడుదలకానున్న REDMI 7 స్మార్ట్ ఫోన్
రెడ్మి 7 స్మార్ట్ ఫోన్ మార్చి నెలలో చైనాలో విడుదలయ్యింది మరియు ఇది ఇప్పుడు ఇండియాలో కావడానికి సిద్దమవుతుంది.
ఈ రెడ్మి 7 MIUI 10 ఆధారితమైన Android 9 Pie మరియు 4,000mAh బ్యాటరీతో ఉంటుంది.
ఈరోజు రెడ్మి Y3 స్మార్ట్ ఫోన్, ఇండియాలో లాంచ్ కానున్న విషయం మనకు తెలిసిందే, అయితే ఈ ఫోనుతో పాటుగా షావోమి గతనెల చైనాలో విడుదల చేసినటువంటి REDMI 7 స్మార్ట్ ఫోన్ను కూడా ఇండియాలో విడుదల చేయనునట్లు తెలుస్తోంది. అంటే, షావోమి అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్ అన్నమాట!. వాస్తవానికి, రెడ్మి 7 స్మార్ట్ ఫోన్ మార్చి నెలలో చైనాలో విడుదలయ్యింది మరియు ఇది ఇప్పుడు ఇండియాలో కావడానికి సిద్దమవుతుంది.
Surveyఈ రెడ్మీ 7 స్మార్ట్ ఫోన్, చైనాలో 2GB, 3GB మరియు 4GB RAM వేరియంట్లలో మరియు 16GB, 32GB మరియు 64GB అంతర్గత స్టోరేజి ఎంపికలతో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6.26 అంగుళాల HD+ డిస్ప్లే ఒక 19:9 ఆస్పెక్ట్ రేషియాతో అందించబడింది. అంతేకాకుండా, ఈ ఫోన్ యొక్క స్క్రీన్ ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షనుతో వస్తుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే, వెనుకభాగంలో 12MP + 8MP సెన్సార్లతో ఒక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్పును కలిగి ఉంటుంది. ముందుభాగంలో, సెల్ఫీ కోసం 8MP సెల్ఫీ కెమెరా అందించి. అదనంగా, ఈ పరికరం MIUI 10 ఆధారితమైన Android 9 Pie మరియు 4,000mAh బ్యాటరీతో ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ వెనుకభాగంలో ఒక వేలిముద్ర సెన్సార్ తో ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ వెనుక ప్యానెల్ చూడడానికి, రెడ్మీ నోట్ 7 సిరీస్ కి సమానంగా, ఒక గ్రేడియంట్ డిజైన్ తో ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
