రూ.5,999 ధరలో 13MP + 2MP డ్యూయల్ కెమేరా గల REALME C2 సేల్

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి relme.com మరియు Flipkart నుండి జరగనుంది.

రూ.5,999 ధరలో 13MP + 2MP డ్యూయల్ కెమేరా గల REALME C2 సేల్

రియల్మీ సంస్థ, ఇండియాలో అతితక్కువ ధరలో ఒక డ్యూయల్ కెమేరా, డ్యూ డ్రాప్ నోచ్ డిస్ప్లే మరియు ఒక పెద్ద 4,000 mAh బ్యాటరీ వంటి ప్రత్యేకతలతో తీసుకొచ్చినటువంటి, REALME C2 స్మార్ట్ ఫోన్ యొక్క మరొక ఫ్లాష్ సేల్ ఈ అర్జు మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది.  ఈ ఫోన్ డ్యూయల్ కెమేరా మరియు మంచి ప్రాసెసర్ తో పాటుగా చాల తక్కువ ధరకే తీసుకురావడంతో, ఇది మార్కెట్లో ప్రస్తుతం అమ్మకాలను కొనసాగిస్తున్న మిగిలిన ఫోన్లకు గట్టి పోటీగా నిలచింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి relme.com మరియు Flipkart నుండి జరగనుంది.     

Digit.in Survey
✅ Thank you for completing the survey!

REALME C2 ధర మరియు ఆఫర్లు

రియల్మీ C2 (2GB ర్యామ్ + 16GB స్టోరేజి) – Rs 5,999

రియల్మీ C2 (3GB ర్యామ్ + 32GB స్టోరేజి) – Rs 7,999

రియల్మీ C2 యొక్క మొదటి సేల్ మే నెల 15వ తేదీన ఫ్లిప్ కార్ట్, రియల్మీ మరియు రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ను జియో తో పాటుగా ఎంచుకునేవారికి  5300 రూపాయల విలువగల లాభాలను అందుకోవచ్చు.                          

రియల్మీ C2 ప్రత్యేకతలు

రియల్మీ C2  స్మార్ట్ ఫోన్, ఒక 6.1 అంగుళాల HD డ్యూ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 89%  స్క్రీన్-టూ-బాడీ రేషియోని అందిస్తుంది. ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ మరియు వెనుక ఒక డైమండ్ కట్ డిజైన్ తో వస్తుంది.  అంతేకాదు,ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక హీలియో P 22 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా 2GB ర్యామ్ శక్తితో వస్తుంది.ఇది 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజితో వస్తుంది. అలాగే డ్యూయల్ SIM కార్డులతో పాటుగా ఒక SD మెమొరీ కార్డును కూడా ఒకేసారి వాడుకునేలా ట్రిపుల్ SIM స్లాట్ ఇందులో అందించారు.           

కెమేరాల విషయానికి వస్తే, వెనుక 13MP కెమేరాకు జతగా 2MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, ముందుభాగంలో ఒక 5MP  సెల్ఫీ కెమెరాతో ఉంటుంది మరియు ఇది 8 రకాల బ్యూటీ కస్టమ్ మోడ్లతోవస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా కలర్ OS 6 పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 4000mAh బ్యాటరీతో వస్తుంది మరియు దీనితో వేగవంతంగా ఛార్జ్ చెయ్యవచ్చని సంస్థ చెబుతోంది.  

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo