హానర్ 9X మొదటి సేల్, కేవలం రూ.12,999: ఈరోజు మాత్రమే.
ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈరోజు రాత్రి 12 గంటలకి మొదలవుతుంది.
ఒక పాప్ అప్ సెల్ఫీ మరియు వెనుక ఒక ప్రధాన 48MP కెమేరాతో, హానర్ ఇండియాలో తన Honor 9X స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. వాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్ను, రూ.13,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే, మొదటి సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ను కేవలం రూ.12,999 రుపాయల ధరతో అమ్మనున్నట్లు విడుదల సమయంలో ప్రకటించింది. అంటే, ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ను 1,000 రుపాయల తక్కువ ధరకే కొనవచ్చన్న మాట. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈరోజు రాత్రి 12 గంటలకి మొదలవుతుంది.
SurveyHonor 9X : ధరలు
1. Honor 9X (4GB +12GB) ధర : Rs. 13,999 (మొదటి రోజు Rs. 12,999)
2. Honor 9X (6GB +12GB) ధర : Rs. 16,999
Honor 9X ప్రత్యేకతలు
ఈ హానర్ 9X ఒక ఆక్టా – కోర్ HiSilicon కిరిన్ 710F SoC యొక్క శక్తితో పనిస్తుంది. ఇది 2340 X1080 పిక్సెళ్ళు అందించగల ఒక 6.59 అంగుళాల ఫుల్ – HD+, IPS డిస్ప్లే మరియు 91% స్క్రీన్ టూ బాడీ రేషియాతో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 9 ఫై తో కూడిన EMUI 9.1 స్కిన్ పై నడుస్తుంది, ఈ మొత్తం ప్యాకేజీకి ఒక 4000mAh బ్యాటరీ శక్తినందిస్తుంది. పైన తెలిపిన విధంగా ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు మైక్రో SD కార్డు ద్వారా 512GB వరకు విస్తరించవచ్చు.
కెమేరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ ఒక ట్రిపుల్ కెమెరా సెటప్పును కలిగి ఉంటుంది. ఇక్కడ, ప్రాధమిక కెమెరాగా f / 1.8 ఎపర్చరుతో కూడిన 48MP సెన్సార్ కి జతగా 8MP సూపర్ వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉంది. ముందు భాగంలో, ఇది ఒక16MP పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో వస్తుంది. అలాగే, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా ఉంటుంది మరియు ఇది 3.5mm హెడ్ఫోన్ జాక్ కలిగి ఉంటుంది. మిడ్నైట్ బ్లాక్, బ్లూ వంటి రంగు ఎంపికలతో వస్తుంది.