హానర్ నుండి మంచి కెమేరా ప్రత్యేకతలతో గత సంవత్సరం మార్కెట్లోకి వచ్చినటువంటి, ఈ హానర్ 8X ముందుగా ఈ హానర్ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో హువావే యొక్క HiSillicon Kirin 710 SoC తో ఇండియాలో రూ.14,999 రూపాయల ప్రారంభ ధరలో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బ్లాక్ వేరియంట్ ప్రస్తుతం కేవలం రూ. 9,499 ధరకే అమ్ముడవుతోంది. అధనంగా, ICICI బ్యాంకు యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో EMI ద్వారా కొనేవారికి గరిష్టంగా 1,500 రుపాయల వరకూ తక్షణ డిస్కౌంట్ కూడా దొరుకుతోంది.
Honor 8X (4GB +64GB) బ్లాక్ వేరియంట్ ప్రస్తుత అమెజాన్ ధర : Rs. 9,499
ఈ హానర్ 8X ఒక ఆక్టా – కోర్ HiSilicon కిరిన్ 710 SoC చే శక్తినిస్తుంది. ఇది 2340 X1080 పిక్సెళ్ళు అందించగల ఒక 6.5 అంగుళాల ఫుల్ – HD+, TFT IPS డిస్ప్లే మరియు 18.7: 9 కారక నిష్పత్తితో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 ఓరెయో తో కూడిన EMUI 8.2.0 స్కిన్ పై నడుస్తుంది, ఈ మొత్తం ప్యాకేజీకి 3750mAh బ్యాటరీ శక్తినందిస్తుంది. పైన్ తెలిపిన విధంగా మూడు వేరియంటలలో లభిస్తుంది మరియు మైక్రో SD కార్డు ద్వారా 400GB వరకు విస్తరించవచ్చు.
ఆప్టిక్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ ఒక ద్వంద్వ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. ఇక్కడ, ప్రాధమిక కెమెరాగా f / 1.8 ఎపర్చరుతో కూడిన 20MP సెన్సార్ ఉంది మరియు 2MP సెకండరీ సెన్సార్ ఉంది. ముందు భాగంలో, ఇది f / 2.0 ఎపర్చరుతో ఒక16MP లెన్స్తో వస్తుంది. అలాగే, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా ఉంటుంది మరియు ఇది 3.5mm హెడ్ఫోన్ జాక్ కలిగి ఉంటుంది. బ్లాక్, బ్లూ మరియు రెడ్ వంటి రంగు ఎంపికలతో వస్తుంది.