RealMe X గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు

RealMe X గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసులుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాను ఇక్కడ అందిస్తున్నాను.

రియల్మీ సంస్థ,  ఇండియాలో కొత్తగా ఒక గొప్ప 48MP కెమెరా మరియు మంచి ప్రాసెసర్ తో RealMe X స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. కేవలం ఇది మాత్రమే కానుండా మరెన్నో గొప్ప స్పెక్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ విడుదలయ్యింది. జూలై 18 వ తేదీ నుండి మొదటి సరిగా అమ్మకాలకు రానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసులుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాను ఇక్కడ అందిస్తున్నాను.

1. ఈ రియల్మీ X ఒక 6.53 అంగుళాల FHD + ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో అందించబడుతుంది. దీనితో, మీరు 430nits తో అత్యధికమైన బ్రైట్నెస్ తో మంచి పిక్చర్ క్వాలిటీని పొందుతారు.

2. ఈ స్మార్ట్ ఫోన్ అతి సన్నని అంచులు కలిగి ఉంటుంది మరియు 19.5 :9  ఆస్పెక్ట్ రేషియాతో దాదాపుగా 91.2%  స్క్రీన్-టూ-రేషియో కలిగిన సూపర్ AMOLED  డిస్ప్లేతో ఉంటుంది.

3. రియల్మీ X వెనుక 48MP +5MP  డ్యూయల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులోని 48MP ప్రధాన Sony IMX 586 సెన్సార్ మరియు f /1.7 అపర్చరుతో వస్తుంది మరియు 5MP కెమేరా, పోర్ట్రైట్ లకోసం డెప్త్ సెన్సారుగా ఉపయోగపడుతుంది.

4. ముందుభాగంలో ఒక గొప్ప 16MP పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో మంచి సెల్ఫీలను తీసుకోవచ్చు.  అంతేకాకుండా, HDR తో వీడియోలను కూడా తీసుకోవచ్చు.   

5.  ఈ ఫోన్ ఒక 3,765 mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇది ఒక VOOC ఫ్లాష్ ఛార్జ్ 3.0 టెక్నలాజితో 20వాట్స్ చార్జరుతో వస్తుంది. అంటే అత్యంత వేగంగా ఈ ఫాంను ఛార్జ్ చేసుకోవచ్చు.   

6. రియల్మీ X ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుతో వస్తుంది. ఇది స్పీడుగా పనిచేయగల LPDDR4 RAM తో వస్తుంది.అలాగే, ఇది 10nm సాంకేతికతతో వస్తుంది మరియు జతగా 4GB లేదా 8GB ర్యామ్ తో వస్తుంది. అంతర్గతంగా, ఈ రెండు వేరియంట్లతో 128GB స్టోరేజిని అఫర్ చేస్తోంది.

7. ముఖ్యంగా, ఈ ఫోన్ యొక్క స్క్రీన్ ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ప్రొటక్షన్ తో వస్తుంది. అంటే స్క్రీన్ త్వరగా పాడవ్వదు మరియు రక్షణ కూడా ఉంటుంది.

8.  ఈ ఫోన్, 8.6MM మందంతో సన్నగా మరియు స్పేస్  బ్లూ మరియు పోలార్ వైట్ వంటి రెండు రంగులలో లభిస్తుంది. సౌండ్ పరంగా చూస్తే, ఇది Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది.  

9. ఇందులో, సెక్యూరిటీ ఫీచర్లుగా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మరియు పేస్ అన్లాక్ ఫీచర్లను అందించారు. అంటే ఇది ప్రస్తుత తరానికి స్టైల్ మరియు సేఫ్టీ పరంగా గొప్పగా ఉంటుంది. 

10. రియల్మీ X యొక్క రెండు వేరియంట్ ధరలు      

1. రియల్మీ X –  4GB RAM + 128 GB స్టోరేజి ధర – 16,999

2. రియల్మీ X –  8GB RAM + 128 GB స్టోరేజి ధర – 19,999  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo