ఈనెలలో ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అందుకోనున్న Huawei మరియు హానర్ ఫోన్లు

Updated on 28-Nov-2019
HIGHLIGHTS

ఈ ఫోన్లలో ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అవుతుంది.

హువావే, తన స్మార్ట్ ఫోన్లలో త్వరలో EMUI 10 కోసం రోడ్ మ్యాప్ ప్రకటించింది. అలాగే, ఈ సంస్థ యొక్క ఉప బ్రాండ్ అయినటువంటి హానర్ ఫోన్లలో కూడా ఈ అప్డేట్ అందనుంది. ఈ EMUI 10 తో, ఆండ్రాయిడ్ 10 ఈ ఫోన్లలో అప్డేట్ అవుతుంది. హువావే మరియు హానర్ కి సంభందించిన 30 కంటే ఎక్కువ ఫోన్లకు ఈ అప్డేట్ అందనుంది. అయితే, ఈ అప్డేట్ సెప్టెంబర్ 2019 మొదలుకొని 2020 రెండవ త్రైమాసికం (Q2) వరకూ ఈ అప్డేట్ కొనసాగుతుందని, కంపెనీ ముందుగా ప్రకటించింది.

ముందుగా, నవంబర్ 2019 నెలలో హుయేవే P30 మరియు P30 ప్రో వేరియంట్లకు ఈ అప్డేట్ అందుతుంది. ఇక ఈ సంవత్సరం చివరి నెలలో అంటే డిసెంబర్ నెలలో హువావే మేట్20, 20 ప్రో, RS, మరియు మేట్ X వాటిని అప్డేట్ అందుకుంటాయి. అలాగే, ఇదే నెలలో హానర్ నుండి హానర్ 20, 20 ప్రో మరియు హానర్ వ్యూ 20 వాటి ఫోన్లు అప్డేట్ అందుకోనున్నాయి.

ఇక నాల్గవ దశలో, హువావే P30 లైట్, హువావే P20 సిరీస్ ఫోన్లు మరియు హువావే మేట్ 10 సిరీస్ ఫోన్లు మార్చ్ 2020 నెలలో అప్డేట్ ను అందుకుంటాయి. చివరిగా, 2020 రెండవ త్రైమాసికంలో మిగిలి హువావే హానర్ స్మార్ట్ ఫోన్లు ఈ అప్డేట్ ను పొందనునట్లు ఈ రోడ్ మ్యాప్ ప్రకటించింది.                                                    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :