మస్త్ ఆఫర్లతో Oppo F17 Pro దివాళీ ఎడిషన్ సేల్ మొదలయ్యింది

మస్త్ ఆఫర్లతో Oppo F17 Pro దివాళీ ఎడిషన్ సేల్ మొదలయ్యింది
HIGHLIGHTS

ఈ Oppo F17 Pro దివాళీ ఎడిషన్ వెనుక భాగంలో బంగారు మరియు ఆక్వా గ్రేడియంట్ మాట్టే ఫినిషింగ్ తో వుంటుంది

ఈ Oppo F17 Pro దివాళీ ఎడిషన్ మంచి ఆఫర్లతో తీసుకురాబడింది.

ఈ ఒప్పో ఫోన్ ప్రత్యేకమైన దివాళీ బాక్స్ తో అఫర్ చేస్తున్నట్లు, ఒప్పో తెలిపింది.

దీపావళి పండుగ సందర్భంగా, OPPO మంచి ఫీచర్లతో ఇండియాలో ఇటీవల లంచ్ చేసిన Oppo F17 Pro యొక్క దివాళీ ఎడిషన్ ను కూడా లాంచ్ చేసింది. ఈ Oppo F17 Pro దివాళీ ఎడిషన్ వెనుక భాగంలో బంగారు మరియు ఆక్వా గ్రేడియంట్ మాట్టే ఫినిషింగ్ తో వుంటుంది మరియు ఈ ఫోన్ సేల్ అక్టోబర్ 23 నుండి Amazon మరియు Flipkart తో పాటుగా Online మరియు ఆఫ్ లైన్ ఛానల్స్ అయినా రిటైల్ స్టోర్స్ ద్వారా మొదలయ్యింది. ఈ Oppo F17 Pro దివాళీ ఎడిషన్  మంచి ఆఫర్లతో తీసుకురాబడింది. ఈ అఫర్ వివరాలను క్రింద చూడవచ్చు.

ఈ Oppo F17 Pro దివాళీ ఎడిషన్ చాలా ఆఫర్లతో అందుబాటులో వుంది. ఈ ఒప్పో ఫోన్ ప్రత్యేకమైన దివాళీ బాక్స్ తో అఫర్ చేస్తున్నట్లు, ఒప్పో తెలిపింది. ఇందులో, ప్రత్యేకంగా డిజైన్ చెయ్యబడిన ఒక బ్యాక్ కవర్ మరియు 10,000 ఒప్పో పవర్ బ్యాంక్ ఉచితంగా అఫర్ చేస్తున్నట్లు కూడా పేర్కొంది.

ఇక బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు RBL బ్యాంక్ క్రెడిట్ కార్డుతో EMI ద్వారా ఈ ఫోన్ కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ క్రెడిట్ కార్డుతో EMI ద్వారా ఈ ఫోన్ కొనేవారికి 10% క్యాష్ బ్యాక్ అఫర్ వుంది. ఇక Axis మరియు కోటక్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో కొనేవారికి 10% క్యాష్ బ్యాక్ అఫర్ లను అందించింది.                                   

Oppo F17 Pro దివాళీ ఎడిషన్ ఫీచర్లు

Oppo F17 Pro సన్నని మరియు తేలికపాటి డిజైన్‌ తో కేవలం 7.48 మందం మరియు 164 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఒక 6.4-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED స్క్రీన్‌ ను రెండు సెల్ఫీ కెమెరాల కోసం డ్యూయల్ పంచ్-హోల్ కటౌట్‌ డిజైన్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ మాట్టే బ్లాక్, మ్యాజిక్ బ్లూ మరియు మెటాలిక్ వైట్ కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది.

ఎఫ్ 17 ప్రో మీడియాటెక్ హెలియో పి 95 చిప్ ‌సెట్ శక్తితో వస్తుంది, ఇది 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ ‌తో జతచేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్‌ OS 7.2 తో పనిచేస్తుంది. ఒప్పో ఎఫ్ 17 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ‌తో వస్తుంది మరియు ఇటీవలి వచ్చిన లీక్స్ ప్రకారం, ఇది 48 MP ప్రాధమిక కెమెరా, 8 MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2 MP మాక్రో కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సార్‌ ఈ సెటప్ లో ఉంటుందని భావిస్తున్నారు. ముందు వైపు, 16MP ప్రాధమిక సెల్ఫీ కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. వెనుక కెమెరాలు 30FPS వద్ద 4K UHD వరకు రికార్డ్ చేయగలవు.

VOOC 4.0 యొక్క 30W ఛార్జింగ్ మద్దతు కలిగిన 4,000mAh బ్యాటరీతో రావచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo