Tecno SPARK Go 2020: పెద్ద స్క్రీన్, పెద్ద బ్యాటరీ కేవలం రూ .6,499 ధరలో విడుదలయ్యింది

Tecno SPARK Go 2020: పెద్ద స్క్రీన్, పెద్ద బ్యాటరీ కేవలం రూ .6,499 ధరలో విడుదలయ్యింది
HIGHLIGHTS

SPARK Go 2020 స్మార్ట్ ఫోన్ను టెక్నో తన స్పార్క్ సిరీస్‌ నుండి లేటెస్ట్ ఫో‌నుగా విడుదల చేసింది.

ఈ స్మార్ట్ ఫోన్ను కేవలం రూ .6,499 ధరతో ఇండియాలో ప్రకటించింది.

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ పెద్ద 6.52-అంగుళాల HD + స్క్రీన్, పెద్ద 5000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 13 MP డ్యూయల్ రియర్ కెమెరా వంటి ట్రెండీ ఫీచర్లతో వచ్చింది

SPARK Go 2020 స్మార్ట్ ఫోన్ను టెక్నో తన స్పార్క్ సిరీస్‌ నుండి లేటెస్ట్ ఫో‌నుగా విడుదల చేసింది. టెక్నో స్పార్క్ గో 2020 అని పిలువబడే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ పెద్ద 6.52-అంగుళాల HD + స్క్రీన్, పెద్ద 5000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 13 MP డ్యూయల్ రియర్ కెమెరా వంటి ట్రెండీ ఫీచర్లను కలిగి వున్నా కూడా టెక్నో ఈ స్మార్ట్ ఫోన్ను కేవలం రూ .6,499 ధరతో ఇండియాలో ప్రకటించింది.

SPARK Go 2020 Price 

గ్లోబల్ ప్రీమియం స్మార్ట్ ‌ఫోన్ బ్రాండ్ అయిన టెక్నో తన ఐకానిక్ స్పార్క్ సిరీస్ నుండి – స్పార్క్ గో 2020 స్మార్ట్ ఫోన్ను కేవలం రూ .6499రూపాయల  సరసమైన ధరతో ప్రకటించింది. 

SPARK Go 2020 Offers

స్మార్ట్ ఫోన్ 'ఆల్-రౌండర్' స్మార్ట్ ‌ఫోన్ ఉచిత 1-టైం స్క్రీన్ రీప్లేస్మెంట్  మరియు 1-నెల పొడిగించిన వారంటీ (12 + 1 నెల ) వంటివి అఫర్ చేస్తోంది.

SPARK Go 2020: ఫీచర్లు

SPARK Go 2020 ఎక్కువ స్క్రీన్ ఏరియా అందివ్వడానికి వీలుగా 20: 9 యాస్పెక్ట్ రేషియో గల పెద్ద 6.52 ”డాట్ నాచ్ డిస్ప్లేని కలిగి ఉంది. ఇది గరిష్టంగా 480 నిట్స్ బ్రైట్నెస్, 89.7% స్క్రీన్ టు బాడీ రేషియో మరియు 720×1600 HD + రిజల్యూషన్‌తో లీనమయ్యే వీడియో వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది.ఈ మొబైల్ ఫోన్  హెలియో ఎ 20 1.8 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌లో నడుస్తుంది మరియు ఇది 2 జిబి ర్యామ్ మరియు 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. 

SPARK Go 2020: 13 ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా

మెరుగైన స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ అనుభవం కోసం  స్మృతి ఫోనులో 13MP ప్రైమరీ కెమెరాతో F1.8 ఎపర్చరు, 4X జూమ్, PDAF, డ్యూయల్ ఫ్లాష్‌లైట్ మరియు AI లెన్స్‌తో AI డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరాలో 18 ఆటో సీన్ డిటెక్షన్ మోడ్లు, బోకె ఎఫెక్ట్, AI బ్యూటీ మోడ్ మరియు AI పోర్ట్రెయిట్ మోడ్ కూడా ఉన్నాయి. F2.0 ఎపర్చర్‌తో 8MP సెల్ఫీ కెమెరా మరియు సర్దుబాటు చేయగల ప్రకాశంతో మైక్రో స్లిట్ ఫ్రంట్ ఫ్లాష్ సెల్ఫీ ప్రియులకు ఖచ్చితంగా సరిపోతాయి.

SPARK Go 2020: బ్యాటరీ & సెక్యూరిటీ

ఫేస్ అన్‌లాక్ మరియు 0.2 సె ఫాస్ట్ అన్‌లాక్‌తో స్మార్ట్ ఫింగర్ ప్రింట్ యొక్క స్మార్ట్ సెక్యూరిటీ ఫీచర్, ఫేస్ అన్‌ లాక్ కూడా వుంటుంది. ఒక పేద 5000 mAh బ్యాటరీని కలిగి ఉన్న SPARK Go 2020 ఒక 36 రోజులు స్టాండ్బై టైం, 27 గంటల వెబ్ బ్రౌజింగ్ 19 గంటలు, మ్యూజిక్ ప్లేబ్యాక్ 145 గంటలు, వీడియో ప్లేబ్యాక్ 21 గంటలు మరియు 14 గంటలగేమ్ ప్లే చేస్తుంది.

SPARK Go 2020: ఆడియో షేర్ ఫీచర్ 

స్పార్క్ GO 2020 ఒక ప్రత్యేకమైన ఆడియో-షేరింగ్ ఫీచర్‌తో వస్తుంది, ఇది రెండు బ్లూటూత్ ఇయర్ ‌ఫోన్‌ లను లేదా మూడు బ్లూటూత్ స్పీకర్లను ఒకేసారి కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తుంది – ఫలితంగా కుటుంబం మరియు స్నేహితులతో సమయాన్ని నిజంగా గుర్తుండిపోయేలా చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo