చవక ధరలో ప్రీమియం ఐఫోన్ మాదిరి డిజైన్ తో వచ్చిన Tecno Spark Go 1 ఫస్ట్ సేల్.!

HIGHLIGHTS

Tecno Spark Go 1 ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది

ఈ ఫోన్ ప్రీమియం ఫోన్ మాదిరిగా కనిపించే డిజైన్ తో అడుగుపెట్టింది

టెక్నో స్పార్క్ గో స్మార్ట్ ఫోన్ ను రూ. 7,299 ప్రైస్ తో టెక్నో లాంచ్ చేసింది

చవక ధరలో ప్రీమియం ఐఫోన్ మాదిరి డిజైన్ తో వచ్చిన Tecno Spark Go 1 ఫస్ట్ సేల్.!

టెక్నో ఇండియాలో ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Tecno Spark Go ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది. ఈ ఫోన్ చాలా చవక ధరలో ఐఫోన్ ప్రీమియం ఫోన్ మాదిరిగా కనిపించే డిజైన్ తో మార్కెట్ లో అడుగుపెట్టింది. ఈ ఫోన్ ను చవక ధరలో ప్రవేశపెట్టినా 8GB ర్యామ్ మరియు డ్యూయల్ స్పీకర్లు వంటి మరిన్ని ఫీచర్స్ తో అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Tecno Spark Go 1: ధర

టెక్నో స్పార్క్ గో స్మార్ట్ ఫోన్ ను రూ. 7,299 రూపాయల ప్రైస్ తో టెక్నో లాంచ్ చేసింది. ఈ ఫోన్ సెప్టెంబర్ 3వ తేదీ, అనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి Amazon నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Tecno Spark Go 1: ఫీచర్స్

టెక్నో స్పార్క్ గో 1 స్మార్ట్ ఫోన్ చవక ధరలో వచ్చినా 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు ప్రీమియం ఫోన్ లుక్ అందించే డైనమిక్ పోర్ట్ ఫీచర్ కలిగిన 6.67 ఇంచ్ HD+ స్క్రీన్ ను కలిగి వుంది. ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ను Unisoc T615 ఆక్టా కోర్ చిప్ సెట్ తో అందించింది. ఈ టెక్నో కొత్త ఫోన్ 4GB ఫిజికల్ ర్యామ్ + 4GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

Tecno Spark Go 1 Feature

ముఖ్యంగా ఈ ఫోన్ డిజైన్ గురించి చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ ను ఐఫోన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మాదిరిగా డిజైన్ చేసింది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ ఫ్లాష్ 13MP కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో dts సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు IP54 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ ఉన్నాయి.

Also Read: WhatsApp కొత్త అప్డేట్ తో మరొక గొప్ప ఫీచర్ అందిస్తోంది.!

ఈ ఫోన్ లో 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 Go OS పై నడుస్తుంది. టెక్నో స్పార్క్ గో 1 ఫోన్ ను లైమ్ గ్రీన్, స్టార్ట్రల్ బ్లాక్ మరియు గ్లిటరీ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo