7 వేల ధరకే జబర్దస్త్ స్మార్ట్ ఫోన్ కావాలా! ఈ కొత్త ఫోన్ పై ఒక లుక్కేయండి..!

Updated on 26-Feb-2022
HIGHLIGHTS

7 వేల ధరకే జబర్దస్త్ స్మార్ట్ ఫోన్ కావాలాలంటే, ఇటీవల Tecno ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Tecno Spark 8C ని  పరిశీలించవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7,499 రూపాయల ధరలో 3GB + 3GB వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. ఇది మాత్రమే కాదు, 90Hz రిఫ్రెష్ రేట్ బిగ్ డిస్ప్లే మరియు 5,000mAh బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది.

Tecno Spark 8C: ధర

Tecno Spark 8C స్మార్ట్ ఫోన్ ను 3GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కేవలం రూ.7,499 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుండి సేల్ అవుతోంది. అదనంగా, ఈరోజు నుండి మొదలైన ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ నుండి మరిన్ని ఆఫర్లలతో కూడా అందుబాటులో వుంది.    

Tecno Spark 8C: స్పెక్స్

టెక్నో స్పార్క్ 8సి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.6 ఇంచ్ HD+ రిజల్యూషన్ డాట్ డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ ను 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగివుంటుంది. ఈ ఫోన్ Unisoc T606 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 3GB ర్యామ్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ లేటెస్ట్ HiOS 7.6 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది.

ఇందులో 3GB ఎక్స్ ప్యాండబుల్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని అందించింది. దీని ద్వారా ఇది 6GB వరకూ ర్యామ్ శక్తిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, యాప్స్ వేగంగా ఓపెన్ చేయడానికి మెమొరీ ఫ్యూజన్ ఫీచర్ కూడా అందించినట్లు తెలిపింది. కానీ ఈ రెండు ఫీచర్లు కూడా OTA అప్డేట్స్ ద్వారా అందుతాయని చెప్పింది.         

కెమెరా పరంగా, వెనుక డ్యూయల్ కెమెరా కలిగివుంది. ఇందులో 13MP మైన్ సెన్సార్ మరియు జతగా AI సెన్సార్ ని కలిగివుంటుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 8MP సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగివుంది. టెక్నో ఈ ఫోన్ ను పెద్ద 5000mAh బ్యాటరీ మరియు సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.  

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :