Tecno Pop X 5G: సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో రిలీజ్ అవుతోంది.!

HIGHLIGHTS

ఇండియన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టెక్నో డేట్ అనౌన్స్ చేసింది

టెక్నో యొక్క పాప్ సిరీస్ నుంచి Tecno Pop X 5G స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తున్నట్లు ఈరోజు అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ ను గేమ్ ఛేంజింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు టెక్నో చెబుతోంది

Tecno Pop X 5G: ఇండియన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టెక్నో డేట్ అనౌన్స్ చేసింది. టెక్నో యొక్క పాప్ సిరీస్ నుంచి పాప్ ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తున్నట్లు ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ద్వారా టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ ఫోన్ ను గేమ్ ఛేంజింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు టెక్నో చెబుతోంది.

Tecno Pop X 5G: లాంచ్ డేట్

టెక్నో పాప్ ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేస్తున్నట్లు టెక్నో అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా టీజింగ్ కూడా చేస్తోంది.

Tecno Pop X 5G: ఫీచర్స్

టెక్నో పాప్ ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్ ను గేమ్ ఛేంజింగ్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు టెక్నో తెలిపింది. ఈ ఫోన్ లో ఏరో స్పేస్ గ్రేడ్ 6 సిరీస్ అల్యూమినియం కెమెరా డెకో ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ అండ్ షైనీ డిజైన్ తో ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ ఫోన్ MIL-STD 810H సర్టిఫైడ్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ కలిగి ఉంటుంది. ఇది 1.5 మీటర్ వరకు డ్రాప్స్ ను తట్టుకుని నిలబడగలదని టెక్నో తెలిపింది.

ఈ ఫోన్ లేటెస్ట్ 5జి చిప్ సెట్ తో లాంచ్ ఉంది. జతగా 4 జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 8 జీబీ వర్చువల్ ర్యామ్ కలిగిన బేసిక్ వేరియంట్ ఉంటుంది. అంతేకాదు, 6 జీబీ ఫిజికల్ ర్యామ్ జతగా 12 జీబీ వర్చువల్ ర్యామ్ కలిగిన హైఎండ్ వేరియంట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ గొప్ప కనెక్టివిటీ కూడా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో ఉన్నా కూడా 6500 mAh కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో కాలింగ్ కోసం యాక్టివ్ నోయిస్ క్యాసిలేషన్ ఐసోలేషన్ ఫీచర్ ఉంది. ఇది కాలింగ్ సమయంలో బ్యాగ్రౌండ్ లో వచ్చే అవసర సౌండ్స్ ని తగ్గిస్తుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది.

Also Read: అమెజాన్ సేల్ నుంచి 4 వేలకే 300W Dolby Soundbar అందుకోండి.!

మొత్తంగా, ఈ ఫోన్ ను యూత్ ని ఆకర్షించే గేమ్ ఛేంజింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :