స్పెక్స్ సరిపోలిక : రియల్మీ U1 vs షావోమి రెడ్మి నోట్ 6 ప్రో

HIGHLIGHTS

ఈ రోజు మనం, సరికొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ రెండు స్మార్ట్ ఫోన్లను పోల్చి చూద్దాం.

U సిరీస్ నుండి విడుదలైన మొదటి స్మార్ట్ ఫోన్ ఈ రియల్మీ U1. ఈ స్మార్ట్ ఫోను 25MP కెమెరా ముందు భాగంలో అందించబడింది మరియు ఒక వాటర్ డ్రాప్  నోచ్  డిస్ప్లే తో వస్తుంది. మరో వైపు, షావోమి  రెడ్మి నోట్  6 ప్రో, ముందు మరియు వెనుక ఒక డ్యూయల్  కెమెరా సెటప్ తో షావోమి యొక్క మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ను భారతదేశంలో ఇటీవల విడుదల చేసింది రూ.13,999 ధరతో. కాబట్టి, ఈ ఫోన్ల యొక్క ఆన్ పేపర్ వివరాలతో  పోల్చితే ఉత్తమమైన ప్రత్యేకతలు ఏది అందిస్తుందో చూడాల్సిన పోలికతో ప్రారంభిద్దాం.

ముందుగా,  ఈ రెండు స్మార్ట్ ఫోనుల  డిస్ప్లేలను  సరిపోల్చడంతో  ప్రారంభిద్దాం. 1080 x 2340 పిక్సెళ్లతో  ఈ రియల్మీ U1 ఒక 6.3 అంగుళాల డిస్ప్లే తో ఉంటుంది, అయితే షావోమి రెడీమి నోట్ 6 ప్రో,  1080 x 2280 పిక్సెళ్ల యొక్క రిజల్యూషన్ను అందించే ఒక 6.26 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.

వీటి యొక్క  ప్రాసెసర్ విషయానికి వస్తే, ఈ రియల్ మీ U1, ఈ స్మార్ట్ ఫోనుతో మొట్టమొదటిసారిగా  మీడియాటెక్ హీలియో P70 ని ప్రపంచనికి పరిచేయం చేసింది. ఇక మరొకవైపున,  షావోమి రెడ్మి నోట్ 6 ప్రో క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్ మద్దతుతో పనిచేస్తుంది.

కెమేరా విభానికి వస్తే , ఈ రియల్మీ U1  ఒక 13MP + 2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందుభాగంలో  25MP సెన్సారుతో ఉంటుంది. మరోవైపు, షావోమి ముందు మరియు  వెనుక కూడా  డ్యూయల్ కెమెరాలతో ఈ స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది. షావోమి రెడ్మి నోట్ 6 ప్రో  ముందు ఒక 20MP + 5MP  డ్యూయల్  కెమేరా మరియు వెనుక  12MP + 5MP డ్యూయల్ కెమేరాని కలిగివుంది.

రియల్మీ U1 ఇండియాలో  రూ. 11,999 ధరతో విదుదల చేయబడింది, అలాగే  షావోమి రెడ్మి నోట్ 6 ప్రో  రూ. 13,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :