స్పెసిఫికేషన్స్ సరిపోలిక : ఒప్పో R17 ప్రో vs వన్ ప్లస్ 6T

HIGHLIGHTS

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా డిస్ప్లేలో ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తాయి.

డిసెంబర్ 4 న, ఒప్పో భారతదేశం లో తన ప్రీమియం మిడ్-రేంజ్  విభాగంలో Oppo R17 Pro స్మార్ట్ ఫోన్ను ప్రారంభించింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా – కోర్ ప్రాసెసర్ తో వస్తుంది మరియు వెనుక ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇంకొక వైపు, OnePlus 6T లో కూడా డిస్ప్లే లో ఒక వేలిముద్ర సెన్సార్ మరియు డ్యూయల్ వెనుక కెమెరాతో వస్తుంది. ఈ రెండింటి  స్పెసిఫికేషన్ల  పోలికను చూద్దాం, వీటిలో ఏది మంచి హార్డువేర్ను కలిగివుంటుందో?

ఈ ఫోన్ల డిస్ప్లేల విషయానికి వచ్చినప్పుడు, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 1080 x 2340 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే 6.4 అంగుళాల డిస్ప్లేతో వస్తాయి.

వీటి ప్రాసెసర్లను చూస్తే, వన్ ప్లస్ 6T తాజా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసరుతో వస్తుంది, మరియు ఈ ప్రాసెసర్ ఒప్పో R17 ప్రో లోవున్నా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ కంటే వేగంగా ఉంటుంది.

కెమెరాలకు సంబంధించినంతవరకు, ఒప్పో R17 ప్రో వెనుక ఒక ట్రిపుల్ 12MP + 20MP + TOF 3D సెన్సింగ్ కెమెరాను కలిగి ఉంది. TOF కెమెరా మీరు ఖచ్చితంగా 3 మీటర్ల దూరం లోపల వస్తువులను మ్యాప్ చేయడానికి అనుమతిస్తుంది. ముందు, ఇది 25MP షూటర్ ఉంది. వన్ ప్లస్ 6T విషయానికి వస్తే, ఈ ఫోనులో ముందు ఒక 16MP సెన్సార్ మరియు వెనుక డ్యూయల్ 16MP + 20MP వెనుక కెమెరా కలిగి ఉంటుంది.

ఒప్పో R17 ప్రో 8GB / 128GB వేరియంట్ భారతదేశంలో రూ 45,990 ధరతో ఉంటుంది, అలాగే  వన్ ప్లస్ 6T ను రూ .37,999 ధరతో పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :