Sony Xperia XZ1 స్మార్ట్ ఫోన్ 19MP కెమెరా అండ్ ఆండ్రాయిడ్ 8.0 ఒరియో తో లాంచ్ , ధర Rs 44,990

Sony Xperia XZ1  స్మార్ట్ ఫోన్  19MP  కెమెరా అండ్ ఆండ్రాయిడ్  8.0 ఒరియో తో లాంచ్ ,  ధర  Rs 44,990
HIGHLIGHTS

Sony Xperia Xz1 ఫోన్ గత ఏడాది భారత్ లో లాంచ్ అయిన Xperia XZ ప్లేస్ ని రీప్లేస్ చేసింది .

Sony Xperia Xz1 ఫోన్ గత ఏడాది భారత్ లో లాంచ్ అయిన Xperia XZ  ప్లేస్ ని రీప్లేస్ చేసింది .  దీని ధర Rs 44,990 .  ఈ ఫోన్ నిన్న సాయంత్రం Sony  యొక్క అధికార రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

Xperia XZ1 గత Xperia XZ  లానే కనిపిస్తోంది, కానీ ఈ ఫోన్ తాజా Qualcomm చిప్సెట్ మరియు 3D క్రియేటర్ అని కొత్త కెమెరా ఫీచర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లో 19MP మోషన్ కెమెరా ఉంది, ఇది ఈ ఏడాది ప్రారంభంలో Xperia XZ ప్రీమియంలో కనిపిస్తుంది. ఈ ఫోన్లో 19MP ప్రాధమిక కెమెరా f / 2.0 ఎపర్చరు, లేజర్ ఆటోఫోకస్, ప్రిడిక్టివ్ ఫేజ్ డిటెక్షన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిజేషన్ మరియు LED ఫ్లాష్లతో వస్తుంది. కెమెరా సెకనుకు 960 ఫ్రేముల వద్ద సూపర్  స్లో  మోషన్ వీడియో రికార్డింగ్ కు  మద్దతు ఇస్తుంది.

ఈ ఫోన్లో 3D  క్రియేటర్  అనే కొత్త ఫీచర్ ని  సోనీ ప్రారంభిస్తోంది, దీని వలన వినియోగదారులు 3D స్కాన్లను నేరుగా సృష్టించవచ్చు మరియు 3D ప్రింటర్లతో నేరుగా వాటిని ప్రింట్ చేయవచ్చు . ఈ సాఫ్ట్వేర్ ఫీచర్ లో నాలుగు స్కానింగ్ మోడ్ పేస్ , హెడ్ , ఫ్రీఫార్మ్ మరియు  ఫుడ్ ని  కలిగి ఉంటుంది మరియు స్కానర్ మరియు వైర్లెస్ కనెక్షన్ అవసరం లేదు.  దీనితో పాటు 13MP ముందు కెమెరా, ఇది f / 2.0 ఎపర్చరు మరియు 1080p వీడియో రికార్డింగ్ మద్దతు వస్తుంది.

Xperia XZ1 ఒక 5.2-అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 1920 x 1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ తో వస్తుంది, అలాగే ఇది  కార్నింగ్ గొరిల్లా  గ్లాస్ 5  ప్రొటెక్షన్ మరియు HDR10 మద్దతును కలిగి ఉంది. క్వాల్కమ్ యొక్క స్నాప్డ్రాగెన్ 835 మొబైల్ ప్లాట్ఫారమ్, 4GB RAM మరియు 64GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలిగి ఉంది. ఈ  డివైస్  సైడ్ మౌంటెడ్  ఫింగర్ ప్రింట్ ఇంకా 
 IP68  వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ను అందిస్తుంది. 

Xperia XZ1  ఆండ్రాయిడ్ 8.0 Oreo తో వచ్చిన మొదటి స్మార్ట్ఫోన్ . ఈ హ్యాండ్సెట్ 2700mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది  ఫాస్ట్ ఛార్జ్ 3.0 మరియు మెరుగైన స్టామినా మోడ్ అందిస్తుంది. Xperia XZ1 నీలం, నలుపు, వెండి మరియు గులాబీ రంగు ఎంపికలు అందుబాటులో ఉంది.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo