శామ్సంగ్ గెలాక్సీ M30s ఈ సెప్టెంబర్ 18 న ఇండియాలో లాంచ్ కానుంది

శామ్సంగ్ గెలాక్సీ M30s ఈ సెప్టెంబర్ 18 న ఇండియాలో లాంచ్ కానుంది
HIGHLIGHTS

M30s ఒక పెద్ద సూపర్ AMOLED డిస్ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది.

శామ్సంగ్ బడ్జెట్ వినియోగదారుల కోసం తీసుకొచ్చినటువంటి, M సిరిస్ నుండి ఇప్పటివరకూ లాంచ్ చేసినటువంటి M10,20 మరియు M30 స్మార్ట్ ఫోన్లు మంచి ప్రజాదరణను పొందాయి. ఇప్పుడు, ఈ టెక్ దిగ్గజం ఇదే సిరీస్ నుండి మరొక ఫోన్ అయినటువంటి, గెలాక్సీ M 30s ని ఇండియాలో విడుదల చెయ్యడానికి సెప్టెంబర్ 18 వ తేదీని కేటాయించింది. ఈ స్మార్ట్ ఫోన్ను, అత్యధికంగా ఒక 6,000 mAh పెద్ద బ్యాటరీ సామసామర్ధ్యంతో తీసుకు రానున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఒక ప్రత్యేకమైన పేజీని కూడా ఫ్లిప్కార్ట్ అందించింది. అంటే, ఈ ఫోన్ అమేజాన్ ప్రత్యేకంగా అమ్మకాలను కొనసాగించనున్నట్లు అర్ధమవుతుంది. ఈ గెలాక్సీ M 30s యొక్క డిజైన్ వివరాలను కూడా కొంత వెల్లడించింది.

అమేజాన్ ఇండియా పేజీ అందించిన వివరాల ప్రకారం, ఈ ఫోన్ ఒక అతిపెద్ద 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రావడానికి సిద్ధంగా ఉందని సూచిస్తుంది. అలాగే, సామ్‌సంగ్ గెలాక్సీ ఒక  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను నిలువుగా సమలేఖనం చేసినట్లు చుపిస్తోంది, ఇది వెనుక ప్యానెల్ యొక్క ఎడమ ఎగువ భాగంలో ఉంచబడుతుంది. అంతేకాక, వెనుక వేలిముద్ర సెన్సార్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ యొక్క కుడి అంచున వాల్యూమ్ మరియు పవర్ బటన్లు ఉన్నాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ M 30s ఒక పెద్ద FHD + (2400 x 1080) పిక్సెల్స్ రిజల్యూషన్ గల సూపర్ AMOLED డిస్ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. ఇక కెమెరా విభాగంలో, ఈ గెలాక్సీ M30s  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి, వీటిలో 48MP ని సూచిస్తోంది మరియు కొన్ని లీకులు ప్రకారం , 8MP f / 2.2 అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు 5MP f / 2.2 డెప్త్ సెన్సార్ వంటివి ఉన్నాయి. ముందు కెమెరా ఒక 16MP సెల్ఫీ కెమేరా ఉంటుంది.

ఇది 6GB RAM వరకు జత చేసిన ఎక్సినోస్ 9610 చిప్‌సెట్ ద్వారా శక్తినివ్వగలదు. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అందవచ్చు అవి: 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్, మరియు 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్, వంటి ఎంపికలతో రూ .15 వేల నుంచి రూ .20,000 మధ్య ఉండేలా ఆన్లైన్లో వచ్చిన అంచనా లీక్స్ చెబుతున్నాయి. ఏదేమైనా, అధికారికంగా సంస్థ ప్రకటించే వరకూ ఈ ఫోన్ గురించి ఒక సరైన నిర్ణయానికి రాలేము.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo