Samsung ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది.

HIGHLIGHTS

Samsung లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ని తక్కువ ధరకు కొనాలని ఎదురు చూస్తున్నారా?

సాంసంగ్ ఇండియాలో రిలీజ్ చేసిన రెండు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల ధరలను తగ్గించింది.

సాంసంగ్ గెలాక్సీ ఎం01 మరియు సాంసంగ్ గెలాక్సీ ఎం11 రెండు స్మార్ట్ ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది.

Samsung ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది.

Samsung లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ని తక్కువ ధరకు కొనాలని ఎదురు చూస్తున్నారా?  అయితే, మీకోసమే ఈ గుడ్ న్యూస్ . ఇటీవల, సాంసంగ్ ఇండియాలో రిలీజ్ చేసిన రెండు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల ధరలను తగ్గించింది. ఇటీవల, సాంసంగ్ ఇండియాలో బడ్జెట్ ధరలో రిలీజ్ చేసిన సాంసంగ్ గెలాక్సీ ఎం01 మరియు సాంసంగ్ గెలాక్సీ ఎం11 రెండు స్మార్ట్ ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ముందుగా,  రూ.8,399 రూపాయల ధరతో అమ్ముడైన సాంసంగ్ గెలాక్సీ ఎం01 స్మార్ట్‌ఫోన్ పైన ఇప్పుడు రూ. 500 ధర తగ్గించింది. కాబట్టి, సాంసంగ్ గెలాక్సీ ఎం01 కేవలం రూ.7,999 రూపాయల ధరకు తగ్గింది. సాంసంగ్ గెలాక్సీ ఎం11 పైన కూడా గరిష్టంగా రూ.1,000 రూపాయల వరకూ ధర తగ్గించింది. ఇందులో, సాంసంగ్ గెలాక్సీ ఎం11 స్మార్ట్‌ఫోన్ యొక్క 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ పైన రూ.500 ధర తగ్గించగా, 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ పైన రూ.1,000 ధర తగ్గించింది. అంటే, సాంసంగ్ గెలాక్సీ ఎం11 3GB+32GB వేరియంట్ రూ.10,499 రూపాయలకు, 3GB+32GB వేరియంట్ రూ.11,999 రూపాయలకు లభిస్తున్నాయి.

సాంసంగ్ గెలాక్సీ ఎం11 స్పెసిఫికేషన్                                  

సాంసంగ్ గెలాక్సీ M 11 ఒక 6.4-అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంది మరియు HD + రిజల్యూషన్‌తో వస్తుంది. డిస్ప్లేలో పంచ్-హోల్ డిజైన్ ఇవ్వబడింది, ఇది ఈ రోజుల్లో ట్రెండ్ గా నడుస్తోంది. ఈ పంచ్ హోల్ ఫోన్, సెల్ఫీ కెమెరాను ఎడమ అంచున కలిగిఉంది. ఈ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది, ఇది ఫిక్స్‌డ్ ఫోకస్‌తో వస్తుంది మరియు దాని ఎపర్చరు ఎఫ్ / 2.0 గా ఉంటుంది.

ఇక ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ప్రాధమిక కెమెరా 13 మెగాపిక్సెల్స్ మరియు దాని ఎపర్చరు ఎఫ్ / 1.8, రెండవ కెమెరా 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా మరియు దాని ఎపర్చరు ఎఫ్ / 2.2 మరియు మూడవ డెప్త్ సెన్సార్ పోర్ట్రెయిట్ షాట్స్ తీయడం కోసం ఇవ్వబడింది. ఈ ఫోన్ 1080p వీడియోను 30fps వద్ద రికార్డ్ చేయగలదు. ఇందులో అందించిన శామ్సంగ్ చిప్‌సెట్ గురించి ఇంకా ప్రస్తావించలేదు కాని గెలాక్సీ M 11 ఆక్టా-కోర్ చిప్‌సెట్ ద్వారా శక్తినివ్వనుంది, ఇది 1.8GHz వద్ద క్లాక్ చేయబడుతుంది.

సాంసంగ్ గెలాక్సీ ఎం 11 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ లో ఇవ్వనుంది. మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా కూడా దీని స్టోరేజిని పెంచవచ్చు. ఈ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది మరియు  USB-C పోర్టును కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం, ఈ ఫోనులో బ్లూటూత్ 4.2, 2.4 గిగాహెర్ట్జ్ వై-ఫై బి / జి / ఎన్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo