Samsung Glaxy F41: అతిపెద్ద బ్యాటరీ, sAMOLED స్క్రీన్ తో వస్తోంది

Samsung Glaxy F41: అతిపెద్ద బ్యాటరీ, sAMOLED స్క్రీన్ తో వస్తోంది
HIGHLIGHTS

సాంసంగ్ మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో విడుదల చేయ్యుడానికి సిద్ధమవుతోంది.

Samsung Glaxy F41 స్మార్ట్‌ఫోన్ ని ఇండియాలో అక్టోబర్ 8 న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Glaxy F41 స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే Flipkart బ్యానర్ ద్వారా టీజ్ చేస్తోంది.

సాంసంగ్ మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో విడుదల చేయ్యుడానికి సిద్ధమవుతోంది. Samsung Glaxy F41 స్మార్ట్‌ఫోన్ ని ఇండియాలో అక్టోబర్ 8 న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. Glaxy F41 స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే Flipkart బ్యానర్ ద్వారా టీజ్ చేస్తోంది. Flipkart ఇప్పటికే దీని కోసం ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీని కూడా అందించింది. ఈ Glaxy F41 స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద 6,000 బ్యాటరీ,sAMOLED స్క్రీన్ తో లాంచ్ చేయనున్నట్లు టీజ్ చేస్తోంది.

సాంసంగ్ ఇప్పటికే తన గెలాక్సీ సిరీస్ ద్వారా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. అలాగే, ఇప్పుడు కొత్తగా ప్రకటించిన Samsung Glaxy F41 స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే వరుసలో నిలుస్తుందా అని అనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్ ప్రస్తుతం వినియోగదారులను ఆకర్షిస్తున్న అతిపెద్ద 6,000 బ్యాటరీ మరియు స్క్రీన్ పైన స్పష్టమైన వివరాలను మరియు ఖచ్చితమైన రంగులను చూపించే డిస్ప్లే గా పేరుపొందిన Super AMOLED డిస్ప్లేతో ఈ ఫోన్ తెస్తోంది. ఈ డిస్ప్లేలో ఇన్ఫినిటీ U డిజైన్ ఇస్తున్నట్లు కూడా ప్రకటించింది.   

అలాగే, ఈ గెలాక్సీ ఎఫ్41 స్మార్ట్‌ఫోన్ కెమేరాల విషయంలో కూడా కొన్ని వివరాలను అందించింది. గెలాక్సీ ఎఫ్41 వెనుక ట్రిపుల్ కెమేరా సెటప్ తో కనిపిస్తోంది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో 64MP ప్రధాన సెన్సార్ ని ఉన్నట్లు ధ్రువీకరించింది. అయితే, ఇతర రెండు సెన్సార్ వివరాలను మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. గెలాక్సీ ఎఫ్41 స్మార్ట్‌ఫోన్ ని లైవ్ లో చూడాలంటే అక్టోబర్ 8  వరకూ వేచి చూడాల్సిందే.                        

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo